మావోయిస్టులతో పోరు.. 17 మంది పోలీసులు మృతి

చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ వద్ద గత అర్థరాత్రి దాటిన తర్వాత మావోయిస్టులతో జరిగిన భీకర పోరులో 17 మంది సాయుధ దళాలు మృతి చెందాయి. గత రాత్రి నుండి ఆచూకీ దొరకకుండా పోయిన వారి మృతదేహాలను వారి ఆచూకీ వెతుకుతూ వెళ్లిన దళాలు చివరకు కనుగొన్నట్లు డిఐజి డిఎమ్ అవస్థి తెలిపారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు చింతగుఫ, బుర్‌కాపాల్‌, టైమ్‌లావాడ క్యాంప్‌ ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ […]

Written By: Neelambaram, Updated On : March 22, 2020 3:52 pm
Follow us on

చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా కసల్పాడ్-ఎల్మాగూడ వద్ద గత అర్థరాత్రి దాటిన తర్వాత మావోయిస్టులతో జరిగిన భీకర పోరులో 17 మంది సాయుధ దళాలు మృతి చెందాయి. గత రాత్రి నుండి ఆచూకీ దొరకకుండా పోయిన వారి మృతదేహాలను వారి ఆచూకీ వెతుకుతూ వెళ్లిన దళాలు చివరకు కనుగొన్నట్లు డిఐజి డిఎమ్ అవస్థి తెలిపారు.

మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు చింతగుఫ, బుర్‌కాపాల్‌, టైమ్‌లావాడ క్యాంప్‌ ప్రాంతాల్లో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌(డీఆర్‌జీ), స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌, కమాండో బెటాలియన్‌ ఫర్‌ రెసల్యూట్‌ యాక్షన్‌(కోబ్రా)కు చెందిన భద్రతా సిబ్బంది సుమారు 150 మంది సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో 14 మంది గాయపడగా, వారిని విమానంలో రాయపూర్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. శనివారం మధ్యాహ్నం నుండి పలు సార్లు రెండు వైపులా నుండి కాల్పులు జరిగాయి.

మొత్తం 17 మంది తప్పిపోగా, వారిలో నలుగురు రాత్రి ఫోన్ చేసారని, అయితే ఆ తర్వాత వారి ఆచూకీ కూడా తెలవలేదని డిజిపి చెప్పారు. 1917లో ఏప్రిల్ 24న సుకుమా జిల్లాలో 25 మంది సి ఆర్ పి ఎఫ్ దళాలు చనిపోయిన సంఘటన తర్వాత ఇదే పెద్ద సంఘటన అని తెలిపారు.

సాయుధ బలగాలు తిరిగి వస్తుండగా తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో 250 మందికి పైగా మావోయిస్టు దళాలు చుట్టుముట్టు కాల్పులు జరిపినట్లు తెలుస్తున్నది. 10 ఏకే 45 తుపాకులతో సహా సాయుధ దళాలకు చెందిన 15 ఆటోమేటిక్ తుపాకులు సహితం కనిపించడం లేదు.

ఈ సంఘటనలో డజన్ మందికి పైగా మావోయిస్టులకు తుపాకి గాయాలు జరిగిన్నట్లు భావిస్తున్నారు. ఆదివారం ఉదయం అదనపు దళాలను పంపి గాలింపు చర్యలు చేపట్టినా వారెవ్వరిని కనిపిట్ట్టలేక పోయారు.