దేశం వ్యాప్తంగా కరోనా కేసులున్న 75 జిల్లాల్లో జనతా కర్ఫ్యూను మార్చ్ 31 వరకు పొడిగించమని ప్రధాన మంత్రి కార్యాలయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ జిల్లాల్లో అత్యవసర సేవలు తప్ప మిగిలినవన్నీ బంద్ చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. రైళ్లు, అంతర్ రాష్ట్ర బస్సులు, మెట్రో రైల్ సేవలు కూడా స్థంబింప చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్సులతో కేంద్ర కాబినెట్ కార్యదర్శి కరోనా పరిస్థితిపై జరిపిన సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనా వ్యాప్తిని సమర్థంగా నియంత్రించడానికి కరోనా ప్రభావిత జిల్లాలను మూసేయడం మేలని ఈ సమావేశంలో ఏకాభ్రిప్రాయానికి వచ్చినట్లు ప్రకటించారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్నిన పిలుపుతో ఆదివారం జనతా కర్ఫ్యూకు ప్రజలు బయటకు రాకుండా సహకరించడంతో దీనిని కొనసాగించాలని నిర్ణయించారు. కాగా, ఆయా రాష్ట్రాలలో నెలకొన్న పరిస్థితులను బట్టి ఈ జిల్లాల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా పెంచే అవకాశం ఉంది.
ఈ నిర్ణయం ప్రకారం తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు లాక్ డౌన్ చేసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లో జనతా కర్ఫ్యూ కొనసాగే అవకాశం ఉంది.
మరో వంక రైల్వే శాఖ ప్యాసింజర్ సర్వీసులను పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు రద్దెన రైళ్లన్నింటిని మార్చి 31వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు భారతీయ రైల్వే, కొంకణ్‌రైల్వే సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి.
దూర ప్రాంతాలకు నడిచే ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఇంటర్ సిటీ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అన్ని సబర్బన్ రైళ్లు, కోల్‌కతా మెట్రో రైళ్లు, పూర్తిగా క్యాన్సల్ చేసింది. 31వ తేదీ రాత్రి 12 గంటల వరకు రైళ్ల రాకపోకలపై నిషేధం విధించినట్లు పేర్కొంది. సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు యథావిధిగా నడుస్తాయి.