Manipur Violence: మణి పూర్ లో మరో దారుణం.. గుండెలను పిండేస్తున్న ఫొటోలు

కొద్ది నెలల క్రితం మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థులు అదృశమయ్యారు. వారి ఆచూకీ కోసం బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు.

Written By: Bhaskar, Updated On : September 26, 2023 3:04 pm

Manipur Violence

Follow us on

Manipur Violence: ఈశాన్య రాష్ట్రం మణిపూర్ దాకా గొడవలతో అట్టుడికి పోయింది. దారుణాతి దారుణమైన సంఘటనలతో సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా పార్లమెంట్ స్తంభించిపోయింది అంటే అక్కడ ఎంతటి దారుణమైన అకృత్యాలు జరిగాయో అర్థం చేసుకోవచ్చు. అయితే కొద్ది రోజుల క్రితమే ఆ రాష్ట్రంలో ఇంటర్నెట్ వ్యవస్థను ప్రభుత్వం పునరుద్ధరించింది. అయితే ఆ రాష్ట్రంలో ఇప్పుడు తాజాగా మరొక దారుణం వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఫలితంగా అక్కడ పరిస్థితి ఏమాత్రం అదుపులోకి రాలేదని తెలుస్తోంది.

కొద్ది నెలల క్రితం మణిపూర్ రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థులు అదృశమయ్యారు. వారి ఆచూకీ కోసం బంధువులు స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఆ విద్యార్థులు దారుణ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. వారి మృతదేహాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోను చూస్తే హృదయం ద్రవిస్తోంది. దీంతో మణిపూర్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జాతుల మధ్య నెలకొన్న వైరంతో రాష్ట్రంలో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. ఇటీవల పరిస్థితులు అదుపులోకి రావడంతో సేవలను పునరుద్ధరించింది. ఈ క్రమంలోనే విద్యార్థుల మృతదేహాల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండు ఫోటోలు వైరల్ కాగా.. అందులో ఒక దాంట్లో విద్యార్థులను కొంతమంది సాయుధులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతంలో విద్యార్థులను బంధించి ఉంచగా వారి వెనుక సాయుధులు కనిపిస్తున్నారు. ఆ ఫోటోలో విద్యార్థులు ఇద్దరు గడ్డిపై కూర్చున్నారు. మరో ఫోటోలు విద్యార్థుల మృతదేహాలను పొదల మధ్యలో పడవేసినట్టు కనిపిస్తోంది. ఆ విద్యార్థులను సాయిదులే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఇక ఈ ఫోటోలు సామాజిక మధ్యమలో వైరల్ కావడంతో మరొకసారి మణిపూర్ లో కలకలం చెలరేగింది. చనిపోయిన విద్యార్థులు మైతేయి వర్గానికి చెందినవారు. వారిలో 17 సంవత్సరాల హిజామ్ లింతోంగంబి, 20 సంవత్సరాల ఫిజామ్ హేమ్ జిత్ గా గుర్తించారు. దీంతో కుకీ వర్గానికి చెందిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విద్యార్థులు జూలై 6 నుంచి కనిపించకుండా పోయారు. జూలై 6న ఆంక్షలు చదివించడంతో ఆ విద్యార్థుల్లో ఒక అమ్మాయి నీట్ శిక్షణ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్ళింది. ఈ క్రమంలోనే కోటి విద్యార్థితో బండిపై లాంగ్ డ్రైవ్ కు వెళ్ళింది. ఇప్పటినుంచి వారిద్దరూ కనిపించకుండా పోయారు.. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయ్యాయి. వారిద్దరూ ఇంపాల్ కు మీపంలోని నంబోల్ వైపు వెళ్లినట్టు సీసీ కెమెరాలో రికార్డు అయింది. అయితే ఆ విద్యార్థులు సాయుధులకు చిక్కి ఉండవచ్చు అని, వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. ఈ సంఘటనపై మణిపూర్ ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించారు. దీంతోపాటు మణిపూర్ లో జరిగిన మరో 9 దారుణమైన సంఘటనలపై సిబిఐ విచారణ కొనసాగిస్తోంది.