Manchu Manoj- Bhuma Mounika Reddy: ఆంధ్రప్రదేశ్ లో నంద్యాల నియోజకవర్గంలో భూమా నాగిరెడ్డి కుటుంబం గురించి అందరికి తెలిసిందే. వారి కుటుంబ నేపథ్యంపై అందరికి అవగాహన ఉంది. దీంతో వారి ప్రతి కదలిక తెలిసిపోతోంది. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులకు ముగ్గురు సంతానం. అఖిల ప్రియ, మౌనిక, జగత్ విఖ్యాత్ రెడ్డి. భూమా నాగిరెడ్డి నంద్యాల నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అఖిల ప్రియ కూడా టీడీపీలో మంత్రిగా కొనసాగిన విషయం తెలిసిందే. భూమా నాగిరెడ్డి పై అందరికి ఎంతో గౌరవం ఉండటం సహజమే. కర్నూలు రాజకీయాలను శాసించిన భూమా కుటుంబం ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటోంది.

భూమా నాగిరెడ్డి రెండో కూతురు మౌనిక రెడ్డి అక్షరాభ్యాసం ఊటీలోని లారెల్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఉన్నత చదువులు కూడా అక్కడే చదివింది. ఆంగ్లంపై మంచి పట్టున్న మౌనిక ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడగలదు. ఫ్యాక్షన్ రాజకీయాలకు దూరంగా మౌనికను తండ్రి దూరంగా ఉంచి చదువు చెప్పించారు. మౌనిక అంటే నాగిరెడ్డికి ఎంతో ఇష్టం. దీంతో ఆమెను గారంగా చూసుకునేవారు. దీంతో మౌనికకు తండ్రి మీద ప్రేమ ఎక్కువగా ఉండేది. తన తండ్రి చనిపోయినా ఆయన నెంబర్ ఇప్పటి వరకు కూడా మై హీరో అని ఫోన్ లో ఉంచుకోవడం తెలిసిందే. తండ్రిపై ఉన్న మమకారంతో మౌనిక రాజకీయాల్లోకి వస్తారని భావించినా ఆమె దూరంగా ఉండటం తెలిసిందే. తండ్రి చనిపోయినప్పుడు తానే స్వయంగా రాజకీయాల్లోకి వస్తుందని అందరు ఆశించినా అది జరగలేదు.
శోభా నాగిరెడ్డి ఐదుసార్లు ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసినా పిల్లల బాగోగులు తానే స్వయంగా చూసుకునేది. చిన్న కూతురు మౌనిక చేసే అల్లరి అంటే తల్లిదండ్రులకు ఎంతో ఇష్టం. దీంతో వారికి గారాల పట్టిగా ఉండేది. ఓ సారి మౌనికను చూసేందుకు హాస్టల్ కు వెళ్లిన నాగిరెడ్డిని మౌనిక తాను ఇంటికి వస్తానని మారాం చేసి చొక్కా లాగితే గుండీలు ఊడిపోవడం తెలిసిందే. అప్పటి నుంచే వారికి ఎంతో ఇష్టమైన కూతురుగా మౌనిక అల్లరిని ఎంజాయ్ చేసేవారు.
రెండో కూతురు మౌనిక ప్రస్తుతం వార్తల్లో నిలుస్తోంది. ఆమె బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త గణేష్ ను 2016లో వివాహం చేసుకుంది. వారికి ఓ కుమారుడు. కొడుకుకు నాన్నపై ఉన్న ప్రేమతో నాగిరెడ్డి అని పేరు పెట్టి తన నాన్న అంటే ఎంత ఇష్టమో చాటిచెప్పింది. కొద్ది రోజులుగా భర్తతో విభేదించిన మౌనిక కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంచు కుటుంబంలో చిన్న వాడైన మంచు మనోజ్ కూడా జీవిత భాగస్వామితో అభిప్రాయభేదాలు రావడంతో ఒంటరిగా ఉంటున్నాడు.

అయితే మౌనిక, మంచు మనోజ్ కలిసి సీతాఫల్ మండిలోని గణేష్ మండపంలో కలిసి పూజలు చేయడం చర్చనీయాంశం అవుతోంది. వీరిద్దరు త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు మీరు వివాహం ఎప్పుడు చేసుకుంటున్నారని ప్రశ్నించగా దానికి సమయం రావాలి అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారనే ప్రచారం ఊపందుకుంది. సామాజిక మాధ్యమాల్లో వీరి వివాహం గురించి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.
మనోజ్ భార్య, మౌనిక భర్తలకు దూరంగా ఉండటంతో వీరు కలిసి పెళ్లి చేసుకుంటారని అందరు విశ్వసిస్తున్నారు. ఈ క్రమంలో భూమా, మంచు కుటుంబాలు త్వరలో వియ్యం అందుకోబోతున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి. దీనిపై రెండు కుటుంబాల్లో అభ్యంతరాలు లేవని తెలుస్తోంది. మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి, పెద్ద కుమారుడు విష్ణువర్ధన్ కూడా ప్రేమ వివాహాలు చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో మంచు విష్ణు, భూమా మౌనికలు వివాహ బంధంతో ఒక్కటవుతారని చెబుతున్నారు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.
[…] Also Read: Manchu Manoj- Bhuma Mounika Reddy: మంచు మనోజ్ తో భూమా మౌనిక … […]
[…] Also Read:Manchu Manoj- Bhuma Mounika Reddy: మంచు మనోజ్ తో భూమా మౌనిక … […]