Visakhapatnam: వివాహేతర సంబంధాలతో ప్రాణాలు పోతున్నాయి. కానీ అవి మాత్రం ఆగడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయి. జరుగుతున్న హత్యల్లో ఎక్కువగా అక్రమ సంబంధాల ప్రభావంతోనే జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పరవాడ మండలం నాయుడుపాలెం శివారు వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన వియ్యపు అఖిలేష్ (23) గత ఏడాది జులై 13న హత్యకు గురయ్యాడు. అతడిని నడుపూరు సమీప రామచంద్రానగర్ గ్రామానికి చెందిన సనా వాసు (28), అదే గ్రామానికి చెందిన పుచ్చ వంశీ (20), కొవురు సందీప్ రెడ్డి (20) కలిసి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

వెంకటపతిపాలెం గ్రామానికి చెందిన అఖిలేష్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం స్వాతి అనే వివాహితతో రామచంద్రానగర్ లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవాడు. భార్య డ్వాక్రా గ్రూపులో సభ్యురాలు కావడంతో ఆమె స్నేహితురాలైన సంతోషి లక్ష్మి అనే మహిళతో ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో అఖిలేష్ సంతోషి లక్ష్మిని తీసుకుని మార్చిలో అనకాపల్లి వెళ్లి కొద్ది రోజులు ఉన్నాడు. అనంతరం పద్మనాభం చేరుకుని అక్కడే ఓ ఇల్లు అద్దెకు తీసుకుని కాపురం చేశాడు.
దీంతో సంతోషి లక్ష్మి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇరువురిని తీసుకొచ్చి కౌన్సెలింగ్ చేసి పంపించారు. అయినా అఖిలేష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో వాసు, వంశీ, సందీప్ రెడ్డి అఖిలేష్ ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో స్వాతి పుట్టింటికి వెళ్లిపోయింది. అఖిలేష్ జాడ మాత్రం లేకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గత ఏడాది నవంబర్ 19న పరవాడ పోలీసులు సంతోషి లక్ష్మి బంధువులపై నిఘా పెట్టి ఆరా తీశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: Chandrababu: చంద్రబాబు బాధ పగోడికి రావద్దట?
సనా వాసు, పుచ్చ వంశీ, సందీప్ రెడ్డిలను అదుపులోకి తీసుకుని విచారించగా హత్య చేసిన విషయం తెలిసింది. దీంతో వారిని ఘటనా స్థలికి తీసుకెళ్లగా అక్కడ హతుడి ఆనవాళ్లు లభించాయి. వాటి ఆధారంగా నిందితులను రిమాండ్ కు తరలించారు. హత్యపై నిందితులు వెల్లడించిన వివరాలతో వారిపై కేసు నమోదు చేశారు. అఖిలేష్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతోనే హత్య చేసినట్లు వెల్లడించారు. 2021 జులై 13న మరోమారు సంతోషి లక్ష్మిని తీసుకుని పద్మనాభం వెళ్లగా అక్కడే హత్య చేసినట్లు తెలిపారు.
పద్మనాభం వెళ్లిన అనంతరం అఖిలేష్ ను మాట్లాడదామని చెప్పి ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని ఆనందపురం మండలంలోని నీళ్ల కుండీలు కూడలి సమీపంలో బండరాయితో ముఖం పట్టలేని విధంగా మోది హత్య చేశారు. అనంతరం అతడి శరీరంపై కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్ పూసి చెత్త కుప్పల్లో వదిలేసి వెళ్లిపోయారు.
Also Read: MP Raghurama: రఘురామ రాజీనామా వెనుక ఇంత స్టోరీ ఉందా..?