బెంగాల్ లో దీదీ హవా.. ప్రతిపక్షం డీలా

పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ బీజేపీ మీద కక్ష తీర్చుకునేందుకు సిద్ధమైంది. శాసనసభ ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) అధ్యక్ష పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కట్టబెట్టడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ముకుల్ రాయ్ కు అప్పగించింది. ముకుల్ రాయ్ కు పదవి ఇవ్వడంపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి గొంతు చించుకున్నారు. ప్రతిపక్షంలోని కీలక నేతను కచ్చితంగా పీఏసీ పదవి ఇచ్చి తీరుతామని చెప్పిన మాట […]

Written By: Srinivas, Updated On : July 14, 2021 4:45 pm
Follow us on

పశ్చిమ బెంగాల్ లో రాజకీయాలు విచిత్ర మలుపులు తిరుగుతున్నాయి. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ బీజేపీ మీద కక్ష తీర్చుకునేందుకు సిద్ధమైంది. శాసనసభ ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) అధ్యక్ష పదవిని ప్రధాన ప్రతిపక్షానికి కట్టబెట్టడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ముకుల్ రాయ్ కు అప్పగించింది. ముకుల్ రాయ్ కు పదవి ఇవ్వడంపై ప్రతిపక్ష నేత సువేందు అధికారి గొంతు చించుకున్నారు.

ప్రతిపక్షంలోని కీలక నేతను కచ్చితంగా పీఏసీ పదవి ఇచ్చి తీరుతామని చెప్పిన మాట ప్రకారం చేశామని దీదీ సెలవిచ్చారు. ప్రతిపక్ష హోదాలో పోరాడదామనుకుంటే మమత అవకాశం ఇవ్వడం లేదు. దీంతో బీజేపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. రాష్ర్టంలో ప్రతిపక్ష హోదాలో పనులు నిర్వహించడానికి అధికారపక్షం అడ్డు తగులుతోంది. దీంతో అధికార పక్షం ఆగడాలకు అడ్డు తగలాలని ప్రతిపక్షం ఆశిస్తోంది.

పశ్చిమ బంగ పీఠంపై అభిషిక్తుణ్ణి చేసి సపరివా సమేతంగా ఢిల్లీపై దండెత్తాలని దీదీ భావిస్తున్నారు. చుక్కాని లేని ప్రతిపక్ష నావలకు తానే నాయకత్వం వహించాలని సంబరపడిపోతున్నారు. హస్తినపురాన్ని చేజిక్కించుకోవడానికి బెంగాల్ బెబ్బులి పంజా బలం సరిపోతుందని ప్రచారం చేస్తున్నారు. దీంతో బీజేపీ నానా అవస్థలు పడుతోంది.

కాంగ్రెస్ పార్టీ మునిగి పోతున్న నావగా భావించి అధికార పార్టీ, బీజేపీ ల వైపు చూస్తున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంపై నిరాశే ఎధురవుతోంది. రాహుల్ గాంధీ ముందుకొచ్చినా పార్టీ ప్రతిష్ట ఇనుమడించే అవకాశాలు లేవు. దీంతో బెంగాల్ లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని భావిస్తున్న బీజేపీకి ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. బెంగాల్ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న ఢిల్లీ పెద్దలు సైతం సరైన సమయంలో సరైన సమాధానం చెప్పాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.