ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో సీఎం మమత బెనర్జీ తాను పోటీచేస్తున్న నందిగ్రాం అసెంబ్లీ నియోజకవర్గంలో వెనుకబడడం సంచలనమైంది. తొలి రౌండ్ లో సీఎం మమతా బెనర్జీ ఏకంగా 1497 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఆమెపై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండులో సువేందుకు 7287 ఓట్లు రాగా.. మమతకు 5790 ఓట్లు వచ్చాయి..
*కమల్ హాసన్ ముందంజ
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కోయంబత్తూర్ సౌత్ నుంచి పోటీచేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో ఆయన తన ప్రత్యర్థిపై కేవలం 46 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
*ఆధిక్యంలో మెట్రో మ్యాన్ శ్రీధరన్
కేరళలో అధికార ఎల్డీఎఫ్ దూసుకుపోతోంది. దాదాపు అధికారం చేపట్టే సీట్లు సాధించే దిశగా సాగుతోంది. అయితే బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన మెట్రో మ్యాన్ శ్రీధరన్ తన సమీప ప్రత్యర్థిపై 41425 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ధర్మదామ్ నుంచి సీఎం విజయన్ సైతం ఆధిక్యంలో ఉన్నారు.