spot_img
Homeజాతీయ వార్తలుMamata Banerjee controversies: మమతా బెనర్జీ తప్పుల మీద తప్పులు.. చివరకు సుప్రీంకోర్టు కన్నెర్ర!

Mamata Banerjee controversies: మమతా బెనర్జీ తప్పుల మీద తప్పులు.. చివరకు సుప్రీంకోర్టు కన్నెర్ర!

Mamata Banerjee controversies: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్‌ కీలకమైదని. ఇక్కడ తృణమూల్‌ కాంగ్రెస్‌ 15 ఏళ్లుగా అధికారంలో ఉంది. ఈసారి కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుల మీద తప్పులు చేస్తూ, ప్రతిష్ఠను దిగజార్చుకుంటున్నారు. ఆమె అనుసరిస్తున్న విధానాలు అనుమానాస్పదంగా మారాయి. ఒకప్పుడు వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉన్న బెంగాల్, ఇప్పుడు మమతా కారణంగా ’గూండా రాజ్‌’గా మారుతోందని విమర్శలు వస్తున్నాయి.

సుప్రీంకోర్టు అధికారులపై దాడి..
తాజాగా సుప్రీంకోర్టు సర్‌ (సిటిజన్‌ షిప్‌ రిజిస్టర్‌) సమస్య పరిష్కరించేందుకు నియమించిన జుడీషియల్‌ అధికారులను మమతా ప్రభుత్వం 9 గంటల పాటు నిర్బంధించింది. ముర్షిదాబాద్‌ జిల్లాలోని బ్లాక్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీస్‌లో ఎన్నికల జాబితాలో పేర్లు నమోదు చేసేందుకు వచ్చిన అధికారులపై దాడి జరిగింది. వారి వాహనాలను ధ్వంసం చేయించారు. ఇది మమతా చేసిన అతిపెద్ద్ద తప్పిదంగా భావిస్తున్నారు. ఈ ఘటన పథకం ప్రకారం జరిగిందని, ముస్లిం మెజారిటీ జిల్లాలో ఉద్దేశపూర్వకంగా దాడులు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కలుగజేసుకోవడంతో, మమతా బుకాయించే ప్రయత్నం చేశారు. కానీ ఏప్రిల్‌ 3న ఒక సభలో మాట్లాడుతూ, ‘తాము జోక్యం చేసుకోకపోయి ఉంటే ఇంకా ఎక్కువ దాడి జరిగేది‘ అని పేర్కొన్నారు. దీంతో అధికారులపై తమకు పట్టు ఉందని ప్రజల ముందే అంగీకరించినట్లైంది.

Also Read: పాకిస్తాన్‌ మరో కుట్ర.. అప్రమత్తమైన భారత్‌!

దాడుల్లో ఎంఐఎం, ముస్లిం పార్టీల నేతలు..
దాడి చేసినవారిలో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలే ఉన్నారని తేలింది. ఇప్పుడు ఎంఐఎం, కొత్తగా ఏర్పడిన ముస్లిం పార్టీలకు చెందినవారు కూడా తృణమూల్తో సంబంధం ఉన్నవారే. తృణమూల్‌ వెనక ఉండి నడిపించినట్లు భావిస్తున్నారు. ఇన్‌సాక్‌ న్యూస్‌ అనే యూట్యూబర్‌ ముఫకరుల్‌ ఇస్లాం (అల్లమా బదానీ)ను అరెస్టు చేయించింది. మతోన్మాద శక్తులను రెచ్చగొట్టి, తృణమూల్‌ అనుకూల, బీజేపీ వ్యతిరేక, భారత వ్యతిరేక, బంగ్లాదేశ్‌కు మద్దతుగా ప్రచారం చేశాడు. ఎన్నికల సంఘం అధికారులపై దాడి చేయమని రెచ్చగొట్టిన ఈ మజ్లిస్‌ నాయకుడు, గతంలో తృణమూల్లో ఉన్నాడు. ప్రజలను తీవ్రంగా రెచ్చగొట్టిన అతను, అల్లర్ల తర్వాత పారిపోయేందుకు సిలిగురి వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి బెంగళూరు పారిపోయే ప్లాన్‌ వేశాడు. సుప్రీంకోర్టు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించడంతో, ఎయిర్‌పోర్టులో అరెస్టు చేశారు. అతని అనుచరులను కూడా అరెస్టు చేశారు.

ఇంటింటి ప్రచారంలో దౌర్జన్యం..
తృణమూల్‌ కాంగ్రెస్‌ నాయకులు ఇంటింటి ప్రచారంలో ఓటర్లను బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు. షఫీక్‌ ఉల్‌ ఇస్లాం అనే కార్యకర్త తృణమూల్‌ బెదిరింపుల వీడియోను షేర్‌ చేశారు, ఇది వైరల్‌ అయింది. కోల్‌కతాలో కూడా ఇద్దరు తృణమూల్‌ నేతలు సర్‌ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది మమతా చేసిన వందో తప్పుగా భావిస్తున్నారు.

మమతా వినతికి నో ఛాన్స్‌..
సుప్రీంకోర్టు ఈ ఘటనలను తీవ్రంగా పరిగణిస్తోంది. మమతా బెనర్జీ వినతిని పట్టించుకునే అవకాశం ఇక కనిపించడం లేదు. న్యాయస్థానం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. బెంగాల్‌లో ప్రజాస్వామ్యం, చట్ట పాలన ప్రమాదంలో పడిందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

మమతా బెనర్జీ తన వ్యూహాలను మార్చుకోకపోతే, బెంగాల్‌ ప్రజలు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రేమికులు ఆందోళన చెందాల్సిన పరిస్థితి నెలకొంది. చట్టాన్ని గౌరవించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడడం ప్రతి నాయకుడి బాధ్యత.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular