Homeజాతీయ వార్తలుMamata Banerjee: గెలుపు కోసం మమత పెద్ద స్కెచ్చే వేసింది.. బాప్ రే బీజేపీ...

Mamata Banerjee: గెలుపు కోసం మమత పెద్ద స్కెచ్చే వేసింది.. బాప్ రే బీజేపీ గెలిచింది కాబట్టి సరిపోయింది..

Mamata Banerjee: అరాచకం నుంచి మొదలు పెడితే అన్యాయం వరకు.. అక్రమం నుంచి మొదలుపెడితే దుర్మార్గం వరకు.. దౌర్జన్యం నుంచి మొదలుపెడితే హింస వరకు.. ఇలా ఎన్ని పదాలుంటే అన్ని పదాలు.. వెస్ట్ బెంగాల్లో మమతా పరిపాలనకు సరిపోవు. గుండా రాజ్ దర్జాగా సాగింది. రక్తపాతం అడ్డు లేకుండా నడిచింది. 15 సంవత్సరాలు పాటు వెస్ట్ బెంగాల్ రావణకాష్టం లాగా రగిలిపోయింది.

చివరికి ప్రజలకు ఆగ్రహం కలిగి. మమత పరిపాలనకు ఎండ్ కార్డు పడింది. అయితే ఇక్కడే ఆమె అక్రమ పరిపాలనకు సంబంధించిన ఒక్కొక్క అంశాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత బెంగాల్ రాష్ట్రంలో టిఎంసి కార్యాలయాలు మూతపడ్డాయి. మొన్నటిదాకా ఒక వెలుగు వెలిగిన ఆ కార్యాలయాలు ఇప్పుడు అమావాస్య చీకటిని తలపిస్తున్నాయి. ఇటీవల కోల్కతా నగరంలోని బిధాన్ నగర్ పరిధిలోని డివిజన్ కార్యాలయాన్ని తెరిచారు. అందులో కుప్పలుగా ఆధార్ కార్డులు బయటపడ్డాయి.

అవన్నీ కూడా పోస్టల్ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సి ఉంది. వాటిని అందకుండా టీఎంసీ కార్యకర్తలు తమ వద్ద ఉంచుకున్నారు. ఆ ఆధార్ కార్డులు మొత్తం బిజెపి కార్యకర్తలవి. పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్ కమిషన్ సర్ అనే విధానాన్ని అవలంబించింది. అందులో ఆధార్ కార్డును కూడా స్వీకరించింది. ఆధార్ కార్డును అందకుండా చేసి బిజెపి కార్యకర్తల ఓట్లను దూరం చేయాలని మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తలు భావించారు. ఎన్నికల్లో బిజెపి అధికారం సాధించిన తర్వాత.. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్పడిన అన్యాయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది కేవలం ఒక వార్డు పరిధిలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితి ఉందని అక్కడి బిజెపి నాయకులు చెబుతున్నారు.

ఆధార్ కార్డులను దగ్గర పెట్టుకొని బిజెపి కి ఓట్లు పడకుండా చేసేందుకు టీఎంసీ కార్యకర్తలు అనేక రకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు. చివరికి పోస్టల్ శాఖను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఆధార్ కార్డులను అందకుండా చేశారు.. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ మమతా బెనర్జీ పార్టీ కార్యకర్తల దుర్మార్గాలు సాగలేదు. చివరికి ప్రజాస్వామ్యంలో అణిచివేతకు అవకాశం లేదని బెంగాల్ ప్రజలు తీర్పు చెప్పారు. దీంతో బిజెపి అధికారంలోకి వచ్చింది. 15 సంవత్సరాల టీఎంసీ దుర్మార్గ పరిపాలనకు చరమగీతం లభించింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version