Pawan Kalyan OG 2 Story: గడిచిన 12 ఏళ్లలో పవన్ కళ్యాణ్ అభిమానులకు గూస్ బంప్స్ రప్పించిన చిత్రం ఏదైనా ఉందా అంటే అది ‘ఓజీ’ నే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం , ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోలేకపోయినప్పటికీ, పర్వాలేదు అనే రేంజ్ టాక్ రావడం తో , ఓపెనింగ్స్ నుండి క్లోజింగ్ వరకు సేసెన్షనల్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకొని సూపర్ హిట్ గా నిల్చింది ఈ చిత్రం. ప్రస్తుతం సోషల్ మీడియా లో మీమర్స్ కి ఓజీ ఒక ఆయుధం లాగా మారిపోయింది. ఏదైనా ఒక సందర్భాన్ని ఎలివేట్ చెయ్యాలంటే ఓజీ చిత్రం లోని సన్నివేశాలను ఉపయోగిస్తున్నారు. జెన్ జీ ఆడియన్స్ లో ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ అలాంటిది మరీ. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంది , అదే విధంగా ప్రీక్వెల్ కూడా ఉంటుందని సుజిత్ ఇది వరకే అధికారిక ప్రకటన చేశాడు.
రీసెంట్ గానే ఆయన ప్రీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేశాడు. ప్రస్తుతం సీక్వెల్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ప్రీక్వెల్ లో ముంబై ని వదిలి , తన సొంత గూటి అయినటువంటి జపాన్ కి వెళ్లిన ‘ఓజాస్ గంభీర’ అక్కడ మాఫియా డాన్ గా ఎలా ఎదిగాడు? , మాస్టర్ ఓరొచ్చి గెంషిన్ గా తన సమురాయ్ సైన్యాన్ని ఎలా నిర్మించుకున్నాడు? , సమురాయ్ లను అంతం చెయ్యాలని చూసిన ‘యాకూజా’ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చేశాడు? వంటి సంఘటనలు ప్రీక్వెల్ లో చూపిస్తారట. అదే విధంగా ఓజాస్ గంభీర్ బాల్యం, అతని తండ్రి ఆజాద్ హింద్ ఫోజ్ హిస్టరీ, ఆజాద్ కి సుభాష్ చంద్రబోస్ తో ఉన్న కనెక్షన్ వంటివి ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు.
ఇక సీక్వెల్ లో అయితే ‘ఓజాస్ గంభీర’ ఈ ప్రపంచాన్ని వణికించే డాన్ గా చూపించబోతున్నారట. జపాన్ , ముంబై లో ఓజాస్ గంభీర సృష్టించిన ప్రకంపనలు , ప్రపంచం మొత్తం పాకడం , ఆ తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఆయా సృష్టించే భీభత్సాన్ని చూసి , ప్రపంచం లోని డాన్స్ , రాజకీయ నాయకులూ మొత్తం ఓజాస్ గంభీర కంట్రోల్ లోకి రావడం వంటివి సీక్వెల్ లో చూపిస్తారట. పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ని అభిమానులు కలలో కూడా ఊహించనంత పవర్ ఫుల్ గా చూపించేలా స్క్రిప్ట్ ని డిజైన్ చేస్తున్నాడట సుజిత్. ఈ ఏడాది లోనే ఈ సినిమాకు సంబంధించిన ముహూర్తపు కార్యక్రమాలు జరుగుతాయని , వచ్చే ఏడాది జనవరి నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుందని అంటున్నారు.
