
Balika Sukanya Yojana Scheme : కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే బాలికా సుకన్య యోజన పథకం ఒకటి. ఇది ఆడపిల్లల పాలిట వరంలా మారింది. ఈ పథకంలో చేరితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ పథకం ఆడపిల్లల పాలిట కామధేనువులా కనిపిస్తోంది. వారి భవిష్యత్ గురించి బెంగ పెట్టుకోకుండా వారికి నెలనెల పొదుపు చేస్తే ఎలాంటి ముప్పు రాకుండా ఉంటుంది.
ఏం చేయాలి
ఆడపిల్ల పుట్టిన తరువాత ఎస్ఎస్ వై పథకంలో చేరితే 15 సంవత్సరాల వరకు పొదుపు చేస్తే 8 శాతం వడ్డీరేటు వస్తుంది. దీంతో వారికి ఎంతో లాభం కలగనుంది. అమ్మాయికి 18 ఏళ్లు వచ్చేనాటికి పొదుపు చేస్తే తరువాత డబ్బులు మనం తీసుకోవచ్చు. మళ్లీ 21 ఏళ్లకు మొత్తం డబ్బు తీసుకుని పెళ్లికి వాడుకోవచ్చు. ఇలా మనం పొదుపు చేస్తే వారి వివాహానికి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు.

ఎంత అవుతుంది?
ఆడపిల్ల పుట్టిన నాటి నుంచి నెలకు రూ.12,500 పెట్టుబడిగా పెడితే ఆమె మెచ్యూరిటీ నాటికి 7.60 శాతం వడ్డీ లభిస్తుంది. దీంతో మనం పెట్టిన పెట్టుబడి రూ.1.50 లక్షలుగా ఉంటుంది. ఇలా చేస్తే ఆదాయపు పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. పెట్టుబడిదారు ఉపసంహరణ చేసుకుంటే రూ. 63,79,634 వస్తుంది. దీంతో పెళ్లి కూడా ఘనంగా చేయొచ్చు.
ఎంత పెట్టొచ్చు
ఇందులో ఏడాదికి కనిష్టంగా రూ.500 గరిష్టంగా రూ.1.50 లక్షలు పెట్టొచ్చు. ఇందులో పన్ను రాయితీ ఉంటుంది. వంద శాతం పన్ను రాయితీ లభిస్తుంది. ఇలా ఆడపిల్లల పాలిట వరంగా మారిన పథకం ఎస్ఎస్ వై కావడంతో తల్లిదండ్రులు ఇందులో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు. నెలనెల ఎంతో కొంత పెట్టుబడిగా పెడితే వారు ఎదిగే నాటికి డబ్బు చేతికి వస్తే చేదోడు వాదోడుగా నిలుస్తుందని చెబుతున్నారు.