Mahashivratri
Mahashivratri : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శంకరుడికి ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు జాగరణలు చేస్తూ మహాశివుడుని నామస్మరణం చేస్తూ గడుపుతారు. అయితే ప్రతి ఏడాదికి ఒకసారి వచ్చే శివరాత్రి రోజున శివుడికి ప్రత్యేక పూజలు చేయడం వల్ల అనేక ఫలితాలు ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. అయితే కొన్ని రాశుల వారికి ఈ శివరాత్రి కలిసి రానుంది. ఈ ఏడాది శివరాత్రి రోజున త్రిగ్రహి ఏర్పడనుంది. ఒకే వరుసలో మూడు గ్రహాల కలయిక ఉండడం వల్ల మొత్తం రాశులపై ప్రభావం ఉండనుంది. అయితే మూడు రాశుల వారికి మాత్రం ఊహించని అదృష్టం పట్టనుంది. దీంతో వీరు ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేయడానికి అవకాశాలు వస్తాయి. మరి ఆ మూడు రాశులు ఏమో తెలుసుకుందాం..
మహాశివరాత్రి రోజున సూర్యుడు, బుధుడు, శని గ్రహాల కలయిక ఉండనుంది. ఈ మూడు గ్రహాల కలయిక వలన ఎక్కువగా తులా రాశిపై ప్రభావం పడనుంది. ఈ రాశి వారు ఇన్నాళ్లు ఎదుర్కొంటున్న కష్టాల నుంచే విముక్తి పొందుతారు. ఆర్థికంగా ఊహించని దానికంటే ఎక్కువగా లాభాలు పొందుతారు. వ్యాపారులు కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి సమయం. ఉద్యోగులకు అన్ని విధాలుగా అనుకూల వాతావరణం ఉంటుంది. జీతం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
త్రీగ్రహీ కారణంగా వృషభ రాశి వారిపై ప్రభావం పడనుంది. ఈ రాశి వారు పిల్లల కోసం ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తారు. భవిష్యత్తులో వారికి అవసరమయ్యే విధంగా డబ్బులు ఆదా చేస్తారు. సంతోషంగా ఉండేందుకు అన్ని రకాల వనరులను ఏర్పాటు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితాలు అందుతాయి. ఉద్యోగులు అదనపు ఆదాయాన్ని పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభిస్తే పెద్దల సలహా తీసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మూడు గ్రహాల కలయిక వలన మకర రాశిపై ప్రభావం పడుతుంది. ఈ రాశి వ్యాపారులు కొత్త భాగస్వాములతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. ఎంతోకాలంగా ఆగిపోయిన డబ్బు వసూల్ అవుతుంది. స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గ గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే పిల్లలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ప్రయాణాలు చేయాల్సి వస్తే వాహనాన్ని ఇతరుల చేత డ్రైవ్ చేయించాలి. కొత్త వ్యక్తులు పరిచయమైతే అప్పుడే ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఎవరితో వాగ్వాదం లేకుండా మాటలు మాధుర్యాన్ని కొనసాగించాలి.