Maharastra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. శివసేన ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేసి ప్రభుత్వాన్ని పడదోసేందుకు సిద్ధమైంది. దీంతో రాష్ట్రంలో పరిస్థితిపై శివసేన ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదివరకే పలు రాష్ట్రాల్లో బీజేపీ అధికార పార్టీలను బురిడీ కొట్టించి అధికారం చేజిక్కించుకున్న సంఘటనలు ఉండటంతో ప్రస్తుతం మహారాష్ట్రలో కూడా అదే తంతు కొనసాగనున్నట్లు సమాచారం. దీనిపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యవసరంగా పార్టీల సమావేశాలు నిర్వహించి చేపట్టబోయే నిర్ణయాలపై దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు.

మొదట సూరత్ వెళ్లిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం గుహవటికి మకాం మార్చినట్లు తెలుస్తోంది. శివసేనకు చెందిన నలభై మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు సమాచారం. మహారాష్ట్రలో ప్రభుత్వం కూలిపోయే ప్రమాదంలో పడింది. దీనిపై దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం శూన్యమే అని నిపుణుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో అసలేం జరుగుతోంది. ఎమ్మెల్యేలు ఎందుకు తిరుగుబాటు చేశారు. వారికి అసహనం కలగడానికి కారణాలేంటనే దానిపై ఆరా తీస్తున్నారు.
Also Read: Pawan Kalyan- Actor Nandu: పవన్ పై యంగ్ హీరో హాట్ కామెంట్..: పొత్తు వారితోనే అంటూ..
ఎమ్మెల్యేలు గుహవటికి చార్టెడ్ విమానంలో చేరుకోగానే వారికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి హిమవంత బిశ్వా సైతం వారిని కలిసినట్లు మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర సర్కారు ప్రమాదంలో చిక్కుకుంది. బీజేపీ మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకోవాలనే వ్యూహంలోనే భాగంగా ఎమ్మెల్యేలతో టూర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నలభై మంది ఎమ్మెల్యేలతో పాటు మరో ఆరుగురు స్వతంత్రుల మద్దతు కూడా ఉందని తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందం నేత షిండే చెబుతున్నారు.

తాజా రాజకీయాల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి. అధికారం కోసం బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ముమ్మాటికి రాష్ర్టంలో అధికారం మారడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో మహారాష్ట్రలో చోటుచేసుకున్న పరిణామాలతో రాజకీయం రసవత్తరంగా మారింది. అధికారానికి శివసేన దూరం కావడం కచ్చితమే అనే అభిప్రాయాలు వస్తున్నాయి. గవర్నర్ కు కరోనా సోకడంతో ఆయన ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. గవర్నర్ రావడమే తరువాయి రాష్ట్రంలో అధికారం మారడంపై చర్యలు మొదలవుతాయని తెలుస్తోంది.
Also Read:Venkaiah Naidu: వెంకయ్యనాయుడికి మోదీ చెక్.. పదోన్నతి లేదు.. కొనసాగింపూ లేదు
[…] Also Read: Maharastra Political Crisis: మహారాష్ట్రలో శివసేన సర్కా… […]