Modi- Draupadi Murmu: కేంద్రంలోని బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేసింది. రాష్ట్రపతి ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ లేని బీజేపీ ప్రాంతీయపార్టీలతో కలిసి రాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకోవాలని స్కెచ్ గీసింది. అందుకే అందరూ అనుకున్న దక్షిణాది సీనియర్ నేత వెంకయ్య నాయుడును పక్కనపెట్టి మరీ.. గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును ఎంపిక చేసింది. ఈ ఎంపిక వెనుక ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా మోడీ మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ బలం 48 ఓట్లశాతం మాత్రమే ఉంది. ప్రతిపక్షాలు, ప్రాంతీయ పార్టీల బలం 51శాతంగా ఉంది. అయితే ఇందులో దేశంలోని కీలకమైన ప్రాంతీయ పార్టీలైన వైసీపీ, ఒడిషాలో బీజేడీలు తటస్థంగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలు అవసరార్థం కేంద్రంలోని అధికార బీజేపీకి మద్దతు ఇస్తుంటాయి.
Also Read: Maharastra Political Crisis: మహారాష్ట్రలో శివసేన సర్కార్ కూలుతుందా? పరిణామాలెలా ఉన్నాయి?
ఈ క్రమంలోనే మోడీ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఏపీలో ఎలాగూ సీఎం జగన్ తమకు మద్దతు ఇవ్వడం గ్యారెంటీ కనుక ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ మద్దతు కోసం వ్యూహాత్మకంగా ఆ రాష్ట్రానికే చెందిన మాజీ గవర్నర్ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో నిలిపారు.
ద్రౌపది ముర్ము ఒడిషాకు చెందిన గిరిజన మహిళ. కౌన్సిలర్ నుంచి గవర్నర్ దాకా అంచెలంచెలుగా ఎదిగారు. సొంత రాష్ట్రం నుంచి గిరిజన మహిళను బీజేపీ రాష్ట్రపతిగా ఎంపిక చేయడంతో ఒడిసాలోని అధికార బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ ఖచ్చితంగా ఆమెకు గెలుపు కోసం ఓట్లు వేస్తారు. ఈ ప్లాన్ తోనే మోడీ, బీజేపీ వ్యూహాత్మకంగా ద్రౌపది ముర్మును రాష్ట్రపతి రేసులో నిలిపారు.

ఇక ఏపీలోని సీఎం జగన్ ఎలాగూ బీజేపీకి మద్దతుగా ఉన్నారు. ఏపీ అవసరాలు, కేసుల దృష్ట్యా ఆయన బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. పైగా పక్క రాష్ట్రం ఒడిషాకు చెందిన గిరిజన మహిళ కావడంతో జగన్ కు అభ్యంతరాలు లేవు. ఇలా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టేలా మోడీ వేసిన స్కెచ్ కు బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు.