https://oktelugu.com/

YCP Party : వైసీపీకి సినీ గ్లామర్ దూరం.. జగన్ స్వయంకృతాపరాధమే!

వైసీపీలో చాలామంది సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఉండేవారు. జగన్ సీఎం కావాలని బలంగా ఆకాంక్షించేవారు. కానీ క్రమేపి వారంతా పార్టీకి దూరమయ్యారు. ఒక్క రోజా తప్ప ఇప్పుడు వైసీపీకి సినీ గ్లామర్ అంటూ లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : November 23, 2024 / 10:28 AM IST

    YCP Party

    Follow us on

    YCP Party :  అన్ని రాజకీయ పార్టీలకు సినీ గ్లామర్ ఉంటుంది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీకి అధికంగా ఉంది. టిడిపి ఆవిర్భావ సమయంలో సినీ పరిశ్రమ నుంచి ఏకపక్ష మద్దతు లభించింది. అయితే అది కంటిన్యూ అవుతూ వస్తోంది. ఆ పార్టీతో పోల్చుకుంటే ఇతర పార్టీలకు సినీ గ్లామర్ తక్కువే. ప్రజారాజ్యం పార్టీ వచ్చిన పెద్దగా సినీ పరిశ్రమ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దక్కలేదు. ఇప్పుడు జనసేన విషయంలో కూడా మిశ్రమ స్పందన ఉంది. పరిశ్రమ అంతా పవన్ కు మద్దతుగా నిలిచింది. అయితే ఈ విషయంలో వైసిపి పూర్తిగా వెనుకబడిపోయింది. ఈ ఎన్నికల్లో ఓడిపోవడంతో సినీ గ్లామర్ అంత పోయింది ఆ పార్టీకి. కొద్ది గొప్ప ఉన్న వారంతా ఇప్పుడు పార్టీకి దూరమవుతున్నారు. కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా వైసీపీకి మద్దతు తెలపడం లేదు. ఆ సాహసం కూడా చేయడం లేదు.

    * చాలామంది మద్దతుగా
    వైసీపీ ఆవిర్భావ సమయంలో చాలామంది సినీ పరిశ్రమ వ్యక్తులు జగన్ కు మద్దతు తెలిపారు. తొలినాళ్లలో ఆ పార్టీ వైపు చూసిన వారిలో జీవితా రాజశేఖర్, దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, సీనియర్ నటులు విజయ్ చందర్, భానుచందర్, యువ నటులు రాజా, కృష్ణుడు వంటి వారు వైసీపీకి చాలా సందర్భాల్లో మద్దతుగా నిలిచారు. నటుడు గిరిబాబు, సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు కూడా వైసిపి మద్దతుదారుల జాబితాలో ఉన్నారు. మంచు మోహన్ బాబు, సీనియర్ నటి జయసుధ సైతం వైసీపీకి సపోర్టుగా నిలిచారు. వీరితో పాటు రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి, కమెడియన్ అలీ, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి వంటి వారు బాహటంగానే మద్దతు ప్రకటించారు.

    * పదవులు కొంతమందికే
    మరోవైపు తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయకుడు ఒకరు జగన్ కు అత్యంత ఆప్తుడు కూడా. అయితే ఎంతమంది మద్దతుగా నిలిచినా వారికి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి కి టీటీడీ ఛానల్ చైర్మన్ పదవి ఇచ్చారు. వివాదాల నడుమ ఆ పదవి నుంచి తప్పించారు. దీంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. అలికి రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తారనిప్రచారం జరిగింది. చివరకు మీడియా సలహాదారు పాత్రతో ముగించారు. ఎన్నికల్లో వైసీపీ ఓటమితో ఆ పార్టీతో తనకు సంబంధం లేదని అలీ ప్రకటించారు. మోహన్ బాబు తో పాటు మిగతా వారంతా ఎప్పుడో పార్టీకి దూరమయ్యారు. పార్టీలో కొనసాగుతూ వస్తున్న పోసాని కృష్ణ మురళి తాజాగా గుడ్ బై చెప్పారు. అయితే ఇప్పుడు వైసీపీలో ఉన్నది కేవలం రోజా మాత్రమే. ఆమె సినీ నటి కంటే రాజకీయ నేతగానే ఎక్కువ గుర్తింపు పొందారు. వైసిపి పూర్తిగా సినీ గ్లామర్ కోల్పోయినట్టే.