Maharashtra: మల్లన్న సినిమా చూశారా. అందులో ఆదాయపు పన్ను శాఖ లో హీరో విక్రమ్ పని చేస్తుంటాడు. ఒక అక్రమ వ్యవహారాన్ని నిగ్గు తేల్చడానికి అతడు తన సిబ్బందితో కలిసి వెళ్తాడు. అక్కడ తనిఖీలు చేయగా అతడికి నోట్ల కట్టలు లభిస్తాయి. ఆ తర్వాత ఆ కేసును పక్కనపెట్టి, ఈ నోట్ల వ్యవహారం గురించి దర్యాప్తు చేస్తే అతడికి దిగ్బ్రాంతి కరమైన వాస్తవాలు తెలుస్తాయి. సేమ్ ఆ సినిమా మాదిరిగానే మహారాష్ట్రలోని పూనే ప్రాంతంలో ఓ సంఘటన జరిగింది. ఇది కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
మహారాష్ట్రలోని పూణే నగరంలో కొందువా అనే ఏరియా ఉంది. ఈ ప్రాంతంలో ఒక కుటుంబం కిరాణా వస్తువులు లభించే షాప్ తో పాటు, బెల్ట్ షాప్ కూడా నిర్వహిస్తోంది. బెల్ట్ షాప్ లో అక్రమంగా మద్యం నిల్వ ఉంచారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు.
ఆ ఇంట్లో పడక గదిలో పోలీసులు తనిఖీలు చేయగా వారికి దిమ్మతిరిగే నిజాలు తెలిసాయి. పడక గదిలో కప్ బోర్డ్స్ లో ఎక్కడ చూసినా సరే నోట్ల కట్టలే కనిపించాయి. ఆ ఇంట్లో వెతికినాకొద్ది నోట్ల కట్టలు బయటపడ్డాయి. దీంతో పోలీసులు ఆదాయపు పను శాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఆదాయపు పన్ను శాఖ అధికారులు నోట్లు లెక్కించే యంత్రాలను పట్టుకొచ్చారు. ఆ ఇల్లు మొత్తం వెతికారు. లభించిన నోట్ల కట్టలను లెక్కిస్తే మొత్తంగా కోటి రూపాయల నగదు బయటపడింది. పోలీసుల తనిఖీలలో ఆ ఇంట్లో కేవలం రెండు లక్షల విలువైన బీర్లు మాత్రమే లభ్యమయ్యాయి. కోటి రూపాయలకు పైగా నగదును ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడంతో ఆ వ్యాపారి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కేసుతోపాటు.. అక్రమంగా నగదు దాచాడు అనే కేసు కూడా అతని మీద నమోదయింది.
महाराष्ट्र के पुणे के कोंढवा इलाके में अवैध शराब व्यापार के ख़िलाफ़ पुलिस ने बड़ा अभियान चलाया। इस दौरान एक करोड़ से ज्यादा की नकदी जब्त की गई। साथ ही 3 लोग भी गिरफ्तार हुए हैं। #Pune #रेड #Maharashtra #maharashtranews pic.twitter.com/8Onr3hiJYq
— SANJAY TRIPATHI (@sanjayjourno) December 26, 2025