Chirag Gandhi: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్.. ఒకప్పుడు టెస్ట్, వన్డే ఫార్మాట్ లో మాత్రమే క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించేవారు. ఆ తర్వాత కాలానుగుణంగా పరిస్థితి మారిపోయింది. టి20 విధానం అందుబాటులోకి వచ్చిన తర్వాత క్రికెట్ స్వరూపం సమూలంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో దాదాపు చాలా వరకు దేశాలు టీ20 క్రికెట్ టోర్నీలను నిర్వహిస్తున్నాయి. అయితే ఈ టోర్నీలలో కొన్ని సందర్భాలలో అద్భుతమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అటువంటిదే ఇది కూడా.
సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న వీడియో ప్రకారం ఓ ప్రాంతంలో టి20 క్రికెట్ టోర్నీ జరిగింది. ఆ టోర్నీలో ఓ ఆటగాడు విపరీతంగా పరుగులు చేశాడు. బౌలర్ల మీద సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. బౌండరీ మీటర్ చిన్నబోయే విధంగా పరుగులు సాధించాడు. తద్వారా తన వ్యక్తిగత స్కోరును 98 పరుగులకు చేర్చుకున్నాడు. ఈ దశలో అతడు సెంచరీ చేస్తాడనుకుంటున్న క్రమంలో మైదానంలో అద్భుతం చోటుచేసుకుంది.
98 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉన్న ఆటగాడు స్ట్రైకర్ గా ఉన్నాడు. ఇటువైపు నుంచి బౌలర్ బంతిని వేశాడు. ఆ బంతి కాస్త బ్యాట్ మధ్యలో నుంచి వెళ్లిపోయింది. వికెట్ కు తగిలింది. కాకపోతే వికెట్ల మీద ఉన్న బేల్స్ కింద పడలేదు. దీంతో బౌలర్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. బ్యాటర్ మాత్రం ఊపిరి పీల్చుకున్నాడు. వాస్తవానికి క్రికెట్ నిబంధనలు ప్రకారం బెల్స్ కింద పడితేనే బ్యాటర్ అవుట్ అయినట్టు..
బంతి తగిలినప్పటికీ వికెట్ల మీద ఉన్న బేల్స్ కింద పడలేదు. దీంతో ఆ బ్యాటర్ హమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత రెండు పరుగులు చేసి సెంచరీ చేశాడు. టి20 క్రికెట్ చరిత్రలో ఇటువంటి సంఘటనలు అరుదుగా జరుగుతుంటాయి. దీనిని నెటిజన్లు ప్రపంచంలో ఎనిమిదవ వింతగా పేర్కొంటున్నారు.
8TH WONDER OF THE WORLD
– I’ve never seen better luck than this in cricket. Batter was on 98 and then this happened
– A must watch video pic.twitter.com/ztAVfPZA4p
— Richard Kettleborough (@RichKettle07) December 27, 2025