Politics Crisis Telugu States: 2018 ఎన్నికల తర్వాత హరీష్ రావుకు, కేసీఆర్ కు ఎందుకు అంత గ్యాప్ ఏర్పడింది ? రాష్ట్రంలోనే అందరికంటే ఎక్కువగా మెజారిటీ సాధించినా కేసీఆర్ అభిమానాన్ని ఎందుకు చూరగొన లేకపోయారు? 2018 లో టీఆర్ఎస్ ను ఓడ గొట్టేందుకు బీజేపీ హరీష్ రావు తో మంతనాలు జరిపిందా? ఈ విషయం ముందే తెలిసి కేసీఆర్ జాగ్రత్త పడ్డారా? లేకుంటే తెలంగాణ మరో మహారాష్ట్ర అయ్యేదా? మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే కంటే ఎక్కువ ఆటిట్యూడ్ చూపించే తెలుగు ముఖ్యమంత్రులకు ఏక్నాథ్ షిండే లాంటి నాయకుడు చెప్పే పాఠాలు ఏంటి? నిజంగానే అలాంటి ఉపద్రవం ముంచుకొస్తే వీరు ఏం చేయగలరు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక సమాధానం రాజకీయాలలో హత్యలు ఉండవు కేవలం ఆత్మహత్యలే. శాశ్వత మిత్రుత్వం, శాశ్వత శతృత్వం రాజకీయాలకు ఎప్పుడూ సరిపడదు.

మహారాష్ట్ర ఒక పాఠం
ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యమని వల్లెవేసే నాయకులంతా గెలిచిన తర్వాత పూర్తి వ్యక్తి స్వామ్యం లోకి వెళ్ళిపోతారు. ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత పూర్తి “యారోగెంట్ పర్సన్” గా మారిపోయారు. నాయకులకు దూరంగా, ప్రజలకు దూరంగా ఉండిపోయారు. పాల్గర్ సాధువుల హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. “ఇంటిగుట్టు లంకకు చేటు” అన్నట్టు సంజయ్ రౌత్, ఏక్నాథ్ షిండే రూపంలో అధికారాన్ని కోల్పోయారు. ప్రస్తుతం మహారాష్ట్ర ముఖ్యమంత్రి కంటే రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు యాటిట్యూడ్ చూపించడంలో ఎక్కువే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండేది ప్రగతిభవన్లో లేదా ఫామ్హౌస్లో.. రాష్ట్రంలో ఎటువంటి ప్రమాదం జరిగినా, ఇంకే ఘటన జరిగినా ఆయన బయటకు రారు. ప్రముఖుల పెళ్లిళ్లకు మాత్రం కచ్చితంగా హాజరవుతుంటారు. ఒక్కోసారి ఫామ్ హౌస్ లోనే మంత్రులతో సమీక్ష నిర్వహిస్తూ ఉంటారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్హౌస్కు వెళ్లే తొవ్వ ఖర్చుతో దళిత బంధు లబ్ధిదారులకు మొత్తం యూనిట్లు మంజూరు చేయొచ్చని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి.
Also Read: Atmakur By Poll Results: ఆత్మకూరు ఉపఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం.. మెజార్టీ ఎంతో తెలుసా?
ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ లో నివాసం ఉంటారు. అతను వెళ్లేదారిలో అటు ఇటు పరదాలు కప్పి ఉంచుతారు. సెలెక్టెడ్ మంత్రులకు తప్ప మిగతా వారికి ఆయన దర్శన భాగ్యం దరిదాపు కలగదు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏకనాథ షిండే ల లాంటి ప్రతిబంధకాలు లేవు. అలాగని నల్లేరు మీద నడక లాగా ఉందని కాదు. ప్రస్తుతం వాతావరణం తుఫాన్ ముందు సముద్రం లాగా ఉంది.
ప్రజలే ఏక్ నాథ్ షిండేలు అవుతారా?
2018 టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజరాబాద్ రూపంలో ప్రజల నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించినా గెలుపు ముందు చతికిల పడింది. ఇది ఒక రకంగా టీఆర్ఎస్కు ప్రజల నుంచి రిఫరెండమే.
ఇక ఏపీ లోని వైఎస్ జగన్కు ఇప్పటివరకు ఎటువంటి ప్రతిబంధకం ప్రజల నుంచి ఎదురు కాలేదు. కానీ ప్రతి ఎన్నికల్లో అధికార పార్టీ అనుసరిస్తున్న విధానమే ఏవగింపు కలిగిస్తోంది. గతంలో జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధానాన్ని అనుసరించే వారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీపై ప్రజల్లో ఆగ్రహం ఉన్నా ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యత వల్ల అది మరుగున పడుతోంది.

పవర్ సెంటర్లతోనే ప్రమాదం
కాంగ్రెస్, ఎన్సీపీతో శివసేన పొత్తు పెట్టుకుని మహారాష్ట్రలో అధికారాన్ని చేజిక్కించుకుంది. కానీ ఆది నుంచి ఉద్దవ్ ఠాక్రే అన్ని తానై వ్యవహరించారు. ఇతర నాయకులకు అంత స్కోప్ ఇవ్వకపోవడంతో సంజయ్ రౌత్, ఏకనాథ్ షిండే రూపంలో పవర్ సెంటర్లు వెలిశాయి. వాటిని ఉద్ధవ్ ఠాక్రే అలాగే వదిలేయడంతో ఆయన పీఠానికి ఎసరు తెచ్చిపెట్టాయి. తెలంగాణలోనూ టీఆర్ఎస్ కు పోటీగా బీజేపీ కార్యకలాపాలు సాగిస్తోంది. అప్పట్లో టీఆర్ఎస్ నుంచి బహిష్కరణకు గురైన ఈటల రాజేందర్ ను చేరదీసి హుజరాబాద్ ఎమ్మెల్యేను చేసింది. అంతేకాకుండా బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలు ఉన్నట్టు హోం శాఖ మంత్రి అమిత్ షా సంకేతాలు ఇచ్చారు. ఈటల రాజేందర్ ను రంగంలో దింపి రూరల్లో బలహీనంగా ఉన్న బీజేపీని మరింత పటిష్టం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అప్పట్లో ఈటెల రాజేందర్ తనకు వ్యతిరేక కుంపటి పెడుతున్నారనే సంకేతాలతో కేసీఆర్ దూరం పెట్టారని సమాచారం. 2018 ఎన్నికల్లో హరీష్ రావును బీజేపీ నాయకులు కలిశారని సమాచారం ఉండటంతో కేసీఆర్ దూరం పెట్టారు. భారీ మెజార్టీ తో గెలిచినా అంతగా పట్టించుకోలేదని సమాచారం. తర్వాత సయోధ్య కుదరడంతో హరీశ్ రావు మంత్రి అయ్యారు. అప్పటి నుంచి పరిస్థితి సెట్ రైట్ అయినట్టు తెలుస్తోంది. ఇక అల్లుడిని దూరం పెట్టినట్టు కొడుకు ను దూరం పెట్టలేరు గనుక కేటీఆర్ ను కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించారు. ప్రస్తుతం పార్టీని కూడా ఆయనకే అప్పగించారు. కీలక శాఖలు కూడా అతనికే ఇచ్చారు. ఇప్పుడు కేటీఆర్ షాడో ముఖ్య మంత్రిగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు నిజాంబాద్ లో ఓటమి తర్వాత కూతురు కవిత నారాజ్ గా ఉండటంతో ఆమెను కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా నియమించారు. మరోవైపు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను కూడా ఎంపీని చేసి సంతృప్తి పరిచారు.
ఇక జగన్ కూడా ఎంపీ రఘురామ కృష్ణరాజు రూపంలో చికాకు రావడంతో దానిని మరింత విస్తృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు. అయినప్పటికీ కొంతమంది నేతలు జగన్ కు ఇబ్బందులు తీసుకొస్తూనే ఉన్నారు.
Also Read:Jagan- Presidential Election: రాష్ట్రపతి ఎన్నిక విషయంలో జగన్ ఆ చాన్స్ మిస్సయ్యారా?
[…] […]