Devendra Fadnavis: పూలు అమ్మిన చోటే.. కట్టెలు అమ్ముకోవాల్సిన పరిస్థతి మహారాష్ట్రంలోని మాజీ సీఎం ఫడ్నీవీస్ దుస్థితి. తన కేబినెట్ లో జూనియర్ మంత్రిగా ఉన్న ఏక్నాథ్ షిండే కింద పనిచేయాల్సి వస్తోంది. ఈ పరిస్థితిని ఫడ్నీవీస్ కూడా ఊహించి ఉండరు. ఉద్దవ్ ఠాక్రేను గద్దె దించితే ఎంచక్కా.. మహారాష్ట్ర పీఠాన్ని దక్కించుకోవాలని ఆయన కలలు గన్నారు. ఏక్నాథ్ షిండేకు ఏ డిప్యూటీ సీఎం, మిగతా వారికి మంత్రి పదవులు కట్టబెట్టవచ్చని భావించారు. అయితే తానొకటి తలిస్తే అధిష్టానం ఒకటి తలచినట్టు.. ఏక్నాథ్ షిండేను సీఎం పీఠంపై కూర్చొబెట్టి పక్కన మీరు చిన్న సీటు సర్దుకోండి అంటూ పెద్దలు అల్టిమేటం ఇవ్వడంతో అమలుచేయడం ఫడ్నవీస్ వంతైంది. నిన్నటి పరిణామాల వరకూ కింగ్ గా ఎదిగిన ఆయన జోకర్ గా మిగిలిపోయారు. తాను ఊహించినట్టుగా కాకుండా పరిణామాలు మారాయి. ఇష్టం లేకున్నా ఇప్పుడు డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చోవాల్సి వస్తోంది. గత కొద్దిరోజులుగా శరవేగంగా పావులు కదిపిన ఆయనకు చుక్కెదురయ్యింది. ఓకింత నిర్వేదానికి గురైనట్టు తెలుస్తోంది.
అంతా తానై వ్యవహరించినా…
వాస్తవానికి అసంత్రుప్తిగా ఉన్న శివసేన మంత్రులు, ఎమ్మెల్యేలను గుర్తించింది ఫడ్నావీసే. మహావికాస్ అఘాడీపై పోరాడుందీ ఆయనే. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి కర్త, ఖర్మ, క్రయ ఆయనే. ఒక మంచి నేతగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఎదిగారు. రెండో సారి బీజేపీని అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ శివసేన రూపంలో .ప్రతికూలత ఎదురైంది. అందుకే దెబ్బకు దెబ్బ కొట్టాలని ప్రయత్నించారు. శివసేనలో అగాధాన్ని రెట్టింపు చేసి సానుకూంగా మార్చుకున్నారు.
Also Read: AP Govt GPF Issue: ఉద్యోగుల సొమ్ము నొక్కేసిన ఏపీ సర్కారు? మరీ ఇంత ‘దివాళా’కోరుతనమా?
శివసేనను నిలువునా.. కాదు కాదు అసలు రూపమే లేకుండా చేసేశారు. అయితే ఈ అపవాదు ఎక్కడ తమపైకి వస్తుందోనని బీజేపీ సరికొత్త ప్లాన్ ను అమలు చేసింది. ఏకంగా ఏక్నాథ్ షిండేను సీఎం పీఠంపై కూర్చొబెట్టి మట్టి తమకు అంటకుండా చూసుకొంది. శివసేన అధిష్టానం, ఉద్దవ్ ఠాక్రే నిర్ణయాలను వ్యతిరేకించి శివసేన సభ్యలు బయటకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారని.. భావసారుప్యత ఉండడంతో మద్దతిచ్చామని చెప్పుకొస్తోంది. తద్వారా ఏక్నాథ్ షిండేను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడమే బీజేపీ లక్ష్యం. అటు తమను బేఖాతరు చేస్తే ఏమవుతుందో ఉద్దవ్ ఉదాంతాన్ని చూపుతూ అటు విపక్షాలకు, మిత్రపక్షాలకు బీజేపీ స్పష్టమైన సంకేతాలు పంపింది.
గవర్నర్ కు కలిసిన తరువాతే..
ఉద్దవ్ ఠాక్రే రాజీనామా అనంతరం ఫడ్నవీస్ సీఎం అంటూ బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. అప్పటి వరకూ బీజేపీ పెద్దల నుంచి ఫడ్నవీస్ కు ఎటువంటి సమాచారం లేదు కాబట్టి తానే సీఎం గా ఆయన భావించారు. కానీ గవర్నర్ కు కలిసిన తరువాత సీన్ మారిపోయింది. బీజేపీ పెద్దలు ఇక్కడే తమ బుర్రకు పదును పెట్టారు. ఏక్నాథ్ షిండే పేరును తెరపైకి తెచ్చి ఫడ్నావీస్ కు షాకిచ్చారు. హఠాత్ పరిణామంతో ఫడ్నీవీస్ కు ఏం చేయాలో పాలుపోలేదు. తన దగ్గర జూనియర్ మంత్రిగా పనిచేసిన వ్యక్తి దగ్గర డిప్యూటీ సీఎంగా పనిచేయలేనని తేల్చిచెప్పారు. బయట నుంచి మద్దతు తెలుపుతామంటూ అధిష్టానానికి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ మీరు ముందు ప్రభుత్వంలో చేరి డిప్యూటీ సీఎం పదవి తీసుకోండి అంటూ బీజేపీ పెద్దలు అల్టిమేటం జారీచేయడంతో కిమ్మనకుండా ఫడ్నావీస్ ఒప్పుకున్నారు. మొత్తానికి కింగ్ అవుదామనుకున్న ఫడ్నావీస్ జోకర్ గా మిగిలిపోయారు.
Also Read:Director Sujeeth- Gopichand: ప్రభాస్ తర్వాత గోపీచంద్ తో చేస్తున్నాడు.. చిరు, బన్నీలతో లేనట్టే