https://oktelugu.com/

Devendra Fadnavis: డిప్యూటీ సీఎం నుదుటిపై కాలితో తిలకం.. ఏంటా ధైర్యం.. వైరల్ పిక్!

‘ఇప్పటి వరకు తాను చాలా మంది తల్లులు, సోదరిమణుల నుంచి నేరుగా ఆశీర్వాదం తీసుకున్నాను. బొట్టు పెట్టించుకున్నాను. కానీ ఒక సోదరి బొటనవేలు తన నుదిటిన చేరింది. అయితే అది చేతి వేలు కాదని కాలి బొటనవేలు’ అని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : June 29, 2023 / 08:14 AM IST

    Devendra Fadnavis

    Follow us on

    Devendra Fadnavis: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కి సంబంధించిన కొన్ని ఫొటోలు కొన్ని తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో దివ్యాంగురాలైన యువతి చూపించిన ఆదరాభిమానానికి తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. ఈ ఫోటోలను దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వయంగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

    దివ్యాంగులతో సమావేశం..
    రాష్ట్రంలోని జలగావ్‌ పర్యటనలో భాగంగా అక్కడ దివ్యాంగుల అభ్యున్నతి, అవసరాల కోసం దీపస్తంభ్‌ ఫౌండేషన్‌ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఫడ్నవీస్‌ చీఫ్‌ గెస్ట్‌గా హాజరయ్యారు. ఫడ్నవీస్‌కు స్వాగతం పలికిన ఓ అంగవైకల్యం ఉన్న యువతి చూపించిన ఆదరాభిమానానికి డిప్యుటీ సీఎం భావోద్వేదానికి లోనయ్యారు. దివ్యాంగురాలిగా ఉన్న యువతి నేలపై కూర్చొని ఉంటే డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆమెతో పాటే నేలపై కూర్చున్నారు. అప్పుడు ఆ అంగవైకల్యం కలిగిన యువతి కాలి బొటన వేలితో ప్లేట్‌లోంచి తిలకం తీసి మహారాష్ట్ర డిప్యుటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ నుదుటిన పెట్టింది. తర్వాత హారతి ఇచ్చింది. ఈ ఘటనతో ఫడ్నవీస్‌ భావోద్వేగానికి గురయ్యారు. అక్కడున్న వాళ్లు ఆ దృశ్యాన్ని చూసి కళ్లు చెమ్మగిల్లాయి.

    దివ్యాంగురాలికి నమస్కరించి..
    తనపై దివ్యాంగురాలు చూపిన ఆదరణకు ముగ్ధుడైన ఫడ్నవీస్‌ సదరు యువతికి రెండు చేతులు జోడించి నమస్కరించారు. ఆమె ముఖంలోని నవ్వు చూసి సంతోషపడ్డారు. తాను పొందిన అనుభూతిని వర్ణిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు దేవేంద్ర ఫడ్నవీస్‌.

    ఈ ఆశీర్వాదం ప్రత్యేకం..
    ‘ఇప్పటి వరకు తాను చాలా మంది తల్లులు, సోదరిమణుల నుంచి నేరుగా ఆశీర్వాదం తీసుకున్నాను. బొట్టు పెట్టించుకున్నాను. కానీ ఒక సోదరి బొటనవేలు తన నుదిటిన చేరింది. అయితే అది చేతి వేలు కాదని కాలి బొటనవేలు’ అని ఫడ్నవీస్‌ పేర్కొన్నారు. ‘చేతులు లేని ఓ సోదరి తనకు కాలి బొటన వేలుతో తిలకం దిద్ది, అదే వేళ్లతో హారతి ఇచ్చింది. అప్పుడు ఆమె మొహంలో చిరునవ్వు, కళ్లల్లో ఒకరకమైన మెరుపు కనిపించింది’ అని ట్విట్టర్‌లో కామెంట్‌ పెట్టారు.

    దివ్యాంగురాలికి భరోసా..
    ఉపముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఫడ్నవీస్‌ దివ్యాంగురాలైన యువతి చూపించిన ఆదరాభిమానం, ప్రేమకు ఒప్పొంగిపోయారు. ఆమెకు ఎల్లవేళలా అండగా ఉంటానని, ఆమె చేసే ప్రతి పోరాటంలో బాసటగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.