https://oktelugu.com/

SPY Movie Twitter Review: స్పై మూవీ ట్విట్టర్ రివ్యూ… నిఖిల్ పాన్ ఇండియా మూవీ హిట్టా? ఫట్టా?

స్పై రోల్ లో నిఖిల్ అధరోగొట్టాడని అంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే, నిఖిల్ పెర్ఫార్మన్స్ సినిమాకు హైలెట్ గా చెబుతున్నారు. అదే సమయంలో మైనస్ పాయింట్స్ కూడా తెరపైకి వస్తున్నాయి.

Written By:
  • Shiva
  • , Updated On : June 29, 2023 / 08:05 AM IST

    SPY Movie Twitter Review

    Follow us on

    SPY Movie Twitter Review: హీరో నిఖిల్ తన రేంజ్ మార్చేశాడు. యూనివర్సల్ సబ్జక్ట్స్ ఎంచుకుంటూ పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నారు. నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై భారీగా తెరకెక్కింది. యాక్షన్ థ్రిల్లర్ గా దర్శకుడు గ్యారీ బిహెచ్ తెరకెక్కించారు. స్పై మూవీలో నిఖిల్ గూఢచారి రోల్ చేస్తున్నారు. ఐశ్వర్య మీనన్ నిఖిల్ కి జంటగా నటించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ప్రధానాంశంగా స్పై తెరకెక్కింది. ఆజాద్ హిందూ పౌజ్ వ్యవస్థాపకుడు చంద్రబోస్ మరణం ఏళ్లుగా మిస్టరీగా ఉంది.

    ఆయన మరణానికి అసలు కారణం ఏమిటనే స్పష్టమైన సమాచారం. ఈ వాస్తవ పరిస్థితిని కథా వస్తువుగా తీసుకుని స్పై తెరకెక్కించారు. సుభాష్ చంద్రబోస్ ఎలా మరణించారు? ఆయన మరణాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? దీని వెనుకున్న మిస్టరీ ఏమిటో ఛేదించే బాధ్యత గూఢచారి నిఖిల్ తీసుకుంటాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి సెంటిమెంట్ సైతం జోడించారు. స్పై మూవీ జూన్ 29న గ్రాండ్ గా విడుదలైంది. ఇప్పటికే యూఎస్ ప్రీమియర్స్ ముగియగా, ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు.

    ట్విట్టర్ లో స్పై చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. కొందరు ఓవర్ ఆల్ గా మూవీ గుడ్ అంటున్నారు. మరికొందరు ఆడియన్స్ మాత్రం లోపాలు కూడా ఉన్నాయంటున్నారు. స్పై మూవీ స్టోరీ, దాన్ని చెప్పిన విధంగా బాగుందని అంటున్నారు. కథ ఆద్యంతం ఉత్కంఠరేపుతూ సాగుతుంది. అనంతరం ఏమవుతుందా అనే ఆత్రుత ప్రేక్షకుల్లో కలుగుతుంది. సుభాష్ చంద్రబోస్ మరణం గురించి చెప్పిన విధానం బాగుంది అంటున్నారు.

    స్పై రోల్ లో నిఖిల్ అధరోగొట్టాడని అంటున్నారు. కథ, స్క్రీన్ ప్లే, నిఖిల్ పెర్ఫార్మన్స్ సినిమాకు హైలెట్ గా చెబుతున్నారు. అదే సమయంలో మైనస్ పాయింట్స్ కూడా తెరపైకి వస్తున్నాయి. నిర్మాణ విలువలు కథకు తగిన స్థాయిలో లేవంటున్నారు. యాక్షన్ సన్నివేశాలు పూర్తి స్థాయిలో మెప్పించలేవంటున్నారు. విజువల్స్, యాక్షన్ సన్నివేశాలు, లొకేషన్స్ పై మరికొంత దృష్టి పెట్టి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేదంటున్నారు. అలాగే మిగతా నటులకు కథలో పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇది వన్ మాన్ షో అంటున్నారు. సోషల్ మీడియా జనాలు స్పై మూవీ పట్ల ఈ విధమైన అభిప్రాయం వెల్లడిస్తున్నారు.