Maharashtra Assembly Elections: మహారాష్ట్రలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, శివసేన(షిండే), ఎన్‌సీపీకలిసి ఏర్పడు చేసిన మహాయుతి కూటమి తన ఎన్నికల మేనిఫెస్టోను ఆదివారం విడుదల చేసింది. ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి అమిత్‌షా మేనిఫెస్టో సంకల్ప్ పత్ర పేరుతో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో మతమార్పిడులు నిరోధిస్తామని తెలిపారు. ఈమేరకు మతమార్పిడి నిరోధక చట్టం అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మేనిఫెస్టోలో 25 హామీలు ఉన్నాయి. ఇక రిజర్వేషన్ల విషయంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమిత్‌షా స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో హిందువులు ఐక్యతను చాటాలన్నారు. మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించడానికి బిజెపి అంతర్గత కమిటీని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ‘మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత, అది అన్ని వాటాదారులతో చర్చలు జరపడానికి ఒక కమిటీని ఏర్పాటు చేస్తుంది. ఇది చాలా కఠినమైన చట్టాలతో వస్తుంది కాబట్టి మత మార్పిడులు జరగవు‘ అని షా స్పష్టం చేశారు.
వక్ఫ్ బోర్డు మెరుగు కోసం..
ఇక కేంద్రం త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టే వక్ప్ బిల్లుపైనా అమిత్‌షా మాట్లాడారు. వక్ప్ బోర్డును మెరుగు పర్చేందుకే ప్రధాని మోదీ ఈ బిల్లు తెచ్చారన్నారు. కర్ణాటకలో వక్ప్ ఫేరుతో గ్రామాలను ఖాళీ చేయించారని, వక్ఫ్ భూముల్లో నిర్మించిన ఆలయాలను కూడా తొలగించేందుకు ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. విపక్ష కూటమి గెలిస్తే.. మహారాష్ట్రలో కూడా జరుగుతాయన్నారు.
ఎన్నికల తర్వాతే సీఎంపై నిర్ణయం..
ఇక మహాయుతి సీఎం ఎవరు అన్న ప్రశ్నకు కూడా అమిత్‌షా సమాధానం ఇచ్చారు. ఎన్నికల తర్వాతనే సీఎం ఎవరనేది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్టీ నేతల కుటుంబ సభ్యులకు టికెట్లు ఇవ్వడంపై మాట్లాడుతూ.. వారసత్వ రాజకీయాలను తగ్గించడానికి ప్రయత్నాలు చేశామన్నారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో ఎక్కువ మంది కుటుంబ రాజవంశీయులు ఉన్నారని తెలిపారు. ఇక సంకల్ప్ పత్ర్‌లోని మొదటి పది హామీలు మహాయుతి కూటమివి అని తెలిపారు. కూటమిలోని పార్టీలు వేర్వేరుగా సొంత సంకల్ఫ్ పత్రాన్ని విడుదల చేస్తాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మూడు పార్టీలకు చెందిన మంత్రుల కమిటీని ఏర్పాటు చేసి, ఇచ్చిన హామీలను 100% అమలు చేయడానికి హామీ ఇస్తుందని పేర్కొన్నారు.
అధికారం కోసమే ఎంవీఏ..
ఇక ఉద్ధవ్ థాక్‌రే నేతృత్వంలోని ఎంవీఏపై అమిత్‌షా మండిపడ్డారు. కేవలం అధికారం కోసం ఏర్పడిన కూటమని పేర్కొన్నారు. 2019లో ప్రజలు ఇచ్చిన తీర్పును ఉద్ధవ్ థాక్రే అపహాస్యం చేశారని పేర్కొన్నారు. ఆయనను ఈసారి ఎక్కడ ఉంచాలో ప్రజలు నిర్ణయించాలని కోరారు. ఆర్టికల్ 370 రద్దు, సీఏఏ సవరణ, ఎన్‌సీఆర్‌న్యుతిరేకించే వ్యక్తులతో ఉద్ధవ్ చేతులు కలిపారని పేర్కొన్నారు. రామ మందిర నిర్మాణంపై రాహుల్‌తో మంచి మాటలు మాట్లాడించగలరా అని ప్రశ్నించారు. కనీసం వీర్ సావర్కర్, బాల్ థాకరేపై మంచి మాటలు చెప్పించాలని సవాల్ చేశారు.