https://oktelugu.com/

AP Budget 2024-25 : రూ.2.94 కోట్లతో ఏపీ బడ్జెట్.. కేటాయింపుల్లో అగ్రభాగం దానికే!

చాలా నెలల తరువాత పూర్తిస్థాయిలో బడ్జెట్ అమల్లోకి వచ్చింది. ఈ ఏడాది మార్చిలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అప్పటినుంచి ఓటాన్ బడ్జెట్ కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది కూటమి ప్రభుత్వం.

Written By:
  • Dharma
  • , Updated On : November 11, 2024 11:26 am
    AP Budget 2024-25

    AP Budget 2024-25

    Follow us on

    AP Budget 2024-25 :  ఏపీ అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అంతకుముందు బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదించింది. దాదాపు రూ. 2.94లక్షల కోట్లతో ఈ బడ్జెట్ను రూపొందించారు.రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులను వివరిస్తూనే..అభివృద్ధితోపాటు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.అమరావతి తో పాటు పోలవరం ప్రాధాన్యత అంశాలుగా తీసుకున్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు.రానున్న నాలుగు నెలల కాలానికి సంబంధించిన కేటాయింపులను బడ్జెట్లో ప్రతిపాదించారు.అన్ని కీలక శాఖలకు ప్రాధాన్యం ఇచ్చారు. రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2.34 లక్షల కోట్లుగా అంచనా వేశారు. మూలధనం వ్యయం అంచనా రూ. 32,712 కోట్లుగా పేర్కొన్నారు.రెవెన్యూ లోటు రూ. 34,713 కోట్లుగా అంచనా వేశారు. జీఎస్టీపీలో రెవెన్యూ లోటు 4.19 శాతం, జీఎస్టీపీలో ద్రవ్యలోటు 2.19 శాతంగా పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందని ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని కూడా చెప్పుకొచ్చారు. పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతామని కూడా హామీ ఇచ్చారు.

    * ప్రజారోగ్యానికి పెద్ద పేట
    బడ్జెట్లో ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారు.ఆరోగ్య రంగానికి 18421 కోట్లు,ఉన్నత విద్యకు 2326 కోట్లు,పంచాయితీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కు 16,739 కోట్లు,అర్బన్ డెవలప్మెంట్ కోసం 11490 కోట్లు, గృహ నిర్మాణానికి 4012 కోట్లు, జల వనరులకు 16,705 కోట్లు,పరిశ్రమలు వాణిజ్యానికి 3127 కోట్లు, ఇంధన రంగానికి 8207 కోట్లు,రోడ్లు భవనాలకు 9554 కోట్లు,పర్యాటక శాఖకు 322 కోట్లు,పోలీస్ శాఖకు 8495 కోట్లు ప్రతిపాదించారు.

    * నాలుగు నెలల కాలానికే
    కేవలం నాలుగు నెలల కాలానికి మాత్రమే ఈ బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. త్వరలో కీలక సంక్షేమ పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆయా శాఖలకు సంబంధించి భారీగా కేటాయింపులు చేశారు.పథకాలు అమలు చేయనున్న శాఖలకు ఎక్కువ నిధులు కేటాయించారు. అన్ని శాఖలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధికి ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చినట్లు బడ్జెట్ కేటాయింపులు తెలియజేస్తున్నాయి.