https://oktelugu.com/

మధ్యప్రదేశ్‌ అప్‌డేట్స్‌: 9 సీట్లు వస్తే బీజేపీదే అధికార పీఠం

మ‌ధ్యప్రదేశ్‌లో టెన్షన్‌ వాతావరణం నడుస్తోంది. ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆ రాష్ర్టంలో అధికారాన్ని డిసైడ్ చేయ‌బోతున్నాయి. జ్యోతిరాధిత్య సింధియా వ‌ర్గంలోని 25 మంది ఎమ్మెల్యేలు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డంతో అక్కడ ఉప ఎన్నిక‌లు అనివార్యమ‌య్యాయి. మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెంద‌డంతో.. మొత్తం 28 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది. Also Read: బీహార్‌‌లో సీన్‌ రివర్స్‌.. ఆధిక్యంలోకి ఎన్డీఏ వీరిలో 12 మంది మంత్రులు ఉన్నారు. అయితే ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 10, 2020 / 10:18 AM IST
    Follow us on

    మ‌ధ్యప్రదేశ్‌లో టెన్షన్‌ వాతావరణం నడుస్తోంది. ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆ రాష్ర్టంలో అధికారాన్ని డిసైడ్ చేయ‌బోతున్నాయి. జ్యోతిరాధిత్య సింధియా వ‌ర్గంలోని 25 మంది ఎమ్మెల్యేలు భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరి త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌డంతో అక్కడ ఉప ఎన్నిక‌లు అనివార్యమ‌య్యాయి. మ‌రో ముగ్గురు ఎమ్మెల్యేలు మృతి చెంద‌డంతో.. మొత్తం 28 స్థానాల‌కు పోలింగ్ జ‌రిగింది.

    Also Read: బీహార్‌‌లో సీన్‌ రివర్స్‌.. ఆధిక్యంలోకి ఎన్డీఏ

    వీరిలో 12 మంది మంత్రులు ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా వ‌స్తాయ‌నేది ఉత్కంఠ‌గా మారింది.  మ‌ధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 స్థానాలు ఉండ‌గా, మ్యాజిక్ ఫిగ‌ర్ వ‌చ్చేసి 116. అయితే ఈ ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ 9 స్థానాలు గెల‌వ‌డం త‌ప్పనిస‌రి. లేనిప‌క్షంలో అధికారం కోల్పోయే అవ‌కాశం ఉంది. ప్రస్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీకి 107 మంది స‌భ్యుల బ‌లం ఉండ‌గా, కాంగ్రెస్ పార్టీకి 87 మంది స‌భ్యుల బ‌లం ఉంది.

    Also Read: బీహార్ కా షేర్ తేజస్వి..మోడీ-నితీష్ కు షాక్ యేనా?

    2018 ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్.. కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే, కేవలం 15 నెలల్లోనే ప్రభుత్వం కూలిపోయింది. మార్చిలో బీజేపీ గూటికి సింధియా వర్గం చేరిన విషయం తెలిసిందే. దాని ఫలితంగా ఖాళీ అయిన 25 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల మృతితో మరో 3 నియోజకవర్గాలు ఈ జాబితాలో చేరాయి. మొత్తం 230 స్థానాలున్న మధ్యప్రదేశ్‌ శాసనసభలో ప్రస్తుతం బీజేపీకి 107, కాంగ్రెస్‌కు 87 మంది ఎమ్మెల్యేలున్నారు. సాధారణ మెజార్టీ 116 కాగా.. ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని బీజేపీకి మరో 9 సీట్లు అవసరం.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఉప-ఎన్నికలు జరిగిన ఎక్కువ స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తే అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునే వీలుంటుంది. 28 చోట్లకు ఎన్నికలు జరగ్గా.. 27 స్థానాలు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఫలితాలు ఏ వర్గానికి అనుకూలంగా రానున్నాయో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గుజరాత్‌, యూపీ సహా వివిధ రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే అక్కడ బీజేపీనే లీడ్‌లో కొనసాగుతున్నట్లు ఇప్పటివరకు వస్తునన్ రిజల్ట్స్‌ను బట్టి చూస్తే అర్థమవుతోంది.