Madhavi Latha On Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నారు. ఆ పార్టీతో కలిసి సాగుతున్నారు. కానీ ఆ పార్టీలో ఉన్నట్టు చెప్పుకుంటున్న ఓ హీరోయిన్ తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. పవన్ కళ్యాణ్ పై మత ముద్ర వేయడానికి ఆమె చేసిన ప్రయత్నం చర్చనీయాంశమైంది. సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో రాజకీయంలోకి అడుగుపెట్టి ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపే ఆ హీరోయిన్ తాజాగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయడం రాజకీయవర్గాల్లో సంచలనమైంది.
బీజేపీ నాయకురాలు, సినీ నటి మాధవీలత తనదైన వ్యాఖ్యలతో నిత్యం వివాదాల్లో నిలుస్తూ ఉంటారు. అయితే తాను జనసేన అభిమానిని చెప్పుకుంటున్న మాధవీలత.. తాజాగా ఆయననే టార్గెట్ చేసి సంచలన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.
Also Read: బిడ్డ పుట్టగానే ఈ 5 సూత్రాలు పాటిస్తే.. లేదంటే కష్టాల్లో ఉన్నట్టే!
రాజకీయ, సినీ ప్రముఖులు ఎవరైనా జన బాహుళ్యంలో ఉన్న సర్వమతాలను గౌరవిస్తూ వాటిని పాటిస్తుంటారు. పవన్ కళ్యాణ్ కూడా అదే చేశాడు. అందులో తప్పు పట్టడానికి ఏం లేదు. ఈ క్రమంలోనే క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు. పవన్ విషఎస్ చెప్పిన తీరును ఇప్పుడు మాధవీలత తప్పు పడుతున్నారు. పవన్ చేసిన పోస్టు మత మార్పిడిలకు ఎంకరేజ్ మెంట్ లా ఉందని విమర్శించారు. ఒక హిందువుగా మీ పోస్టు పట్ల విచారం వ్యక్తం చేసింది.
‘పవన్ క్రిస్మస్ విషెస్ మతమార్పిడిలకు ఎంకరేజ్ మెంట్ లా ఉంది.. విషెస్ పెట్టండి చాలు.. బైబిల్ మనం బోధించనక్కర్లేదు. అక్కడ ఎవరూ దేవుడు లేరు.. రెస్పెక్ట్ ఇద్దాం.. అంతవరకే మీరు రాసిన కంటెంట్ నాకు నచ్చలేదు’ అని మాధవీలత ఫేస్ బుక్ లో విమర్శలు గుప్పించింది.
Also Read: ఏం చేసినా ఇంట్లో డబ్బు నిలబడటం లేదా?.. అయితే ఇవి పాటించి చూడండి!
బైబిల్ గురించి స్పీచుల్లో గొప్పగా పవన్ చెప్పారని.. అంత గొప్ప ఏమీ లేదంటూ మాధవీలత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.ఇలా పవన్ ఏదో క్రిస్మస్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు చెబితే అందులోనూ లూప్ హోల్స్ వెతికి ఆయన్ను ఒక వర్గానికి పరిమితం చేసేలా మాధవీలత ఆరోపణలున్నాయి. చూస్తుంటే పవన్ పై మత ముద్ర వేసి కేవలం హిందుత్వ వాదిగా ప్రొజెక్ట్ చేసే కుట్ర సాగుతుందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.