మదనపల్లి జంట హత్యల్లో మరో కోణం

ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూఢ విశ్వాసం, మానసిక రుగ్మతలతో ఇద్దరు కూతుళ్లను కన్న తల్లిదండ్రులే పొట్టనబెట్టుకున్నారు. జంట హత్యల కేసులో ఇప్పటికే పేరెంట్స్‌ పురుషోత్తంనాయుడు, పద్మజలను అరెస్ట్‌ చేశారు. అయితే.. ఇప్పుడు మదనపల్లి అక్కాచెళ్లెల్ల జంట హత్య కేసుల మిస్టరీ మరో కొత్త కోణానికి దారితీస్తోంది. Also Read: ఎస్‌ఈసీతో గొడవ.. వైసీపీకే మైనస్‌ అవుతోందా..! ఇప్పటివరకు అలేఖ్య, సాయి దివ్య ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ […]

Written By: Srinivas, Updated On : February 4, 2021 1:59 pm
Follow us on


ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా మదనపల్లి జంట హత్యల కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మూఢ విశ్వాసం, మానసిక రుగ్మతలతో ఇద్దరు కూతుళ్లను కన్న తల్లిదండ్రులే పొట్టనబెట్టుకున్నారు. జంట హత్యల కేసులో ఇప్పటికే పేరెంట్స్‌ పురుషోత్తంనాయుడు, పద్మజలను అరెస్ట్‌ చేశారు. అయితే.. ఇప్పుడు మదనపల్లి అక్కాచెళ్లెల్ల జంట హత్య కేసుల మిస్టరీ మరో కొత్త కోణానికి దారితీస్తోంది.

Also Read: ఎస్‌ఈసీతో గొడవ.. వైసీపీకే మైనస్‌ అవుతోందా..!

ఇప్పటివరకు అలేఖ్య, సాయి దివ్య ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అంశాలను కేంద్రంగా చేసుకుని అనేక కొత్తకొత్త కోణాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా.. మరో కొత్త కోణంలో ఈ హత్యలకు సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ హత్యల వెనుక వేల కోట్ల కుట్రకోణం దాగి ఉందన్న అనుమానాలు బహిర్గతమవుతున్నాయి. దంపతులు మదనపల్లి సబ్ జైలులో ఉన్నపుడు హైకోర్టు న్యాయవాది రజని పురుషోత్తమ నాయుడును కలిసి మాట్లాడారు. జంటహత్యల నిందితులను ఎవరో ప్రేరేపించారని ఆమె తెలిపారు.

Also Read: స్పెషల్ స్టోరీ: రైతుల దిగ్బంధం.. ఇది ఎవరి తప్పు?

సుప్రీం కోర్టులో దిశ కేసు వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కృష్ణమాచారి సూచనల మేరకు రజని పురుషోత్తంను జైలులో కలిసి మాట్లాడారు. ఈ హత్యలకు ప్రేరేపించింది మాత్రం వేరే వ్యక్తులు ఖచ్చితంగా ఉండి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పురుషోత్తం నాయుడు, పద్మజ దంపతులకు కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తులను కాజేసేందుకు కూడా ఇలాంటి పన్నాగాలు, కుట్రలు జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ కుటుంబానికి చిత్తూరు, చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్