గ్రేటర్ వార్.. హైకోర్టులో ఎస్ఈసీ లంచ్ మోషన్ పిటిషన్..!

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. అయితే నిన్న ఎన్నికల కమిషన్ స్వస్తిక్ గుర్తుతోపాటు ఇతర గుర్తులను ఓటుగా పరిగణించాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ గా విచారించిన కోర్టు ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది. Also Read: ఫిబ్రవరిలోనే ఏపీ స్థానిక ఎన్నికలు ఈమేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కౌంటింగ్ […]

Written By: Neelambaram, Updated On : December 4, 2020 1:31 pm
Follow us on


గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠగా సాగుతోంది. అయితే నిన్న ఎన్నికల కమిషన్ స్వస్తిక్ గుర్తుతోపాటు ఇతర గుర్తులను ఓటుగా పరిగణించాలని ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ గా విచారించిన కోర్టు ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను రద్దుచేసింది.

Also Read: ఫిబ్రవరిలోనే ఏపీ స్థానిక ఎన్నికలు

ఈమేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో కౌంటింగ్ ప్రక్రియ మరింత ఆలస్యమయ్యేలా కన్పిస్తోంది. ఓ వైపు ఫలితాలు కొనసాగుతుండనే మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టులో లాంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం ఆసక్తిని రేపుతోంది.

హైకోర్టు తీర్పు ఎన్నికల కమిషన్ కు తలనొప్పిగా మారింది. దీంతో ఎస్ఈసీ తాజాగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్ర హోదాలో పని చేస్తుందని.. దీని అధికారాల విషయంలో న్యాయస్థానాలు జోక్యం  చేసుకోవడం సరికాదనే విషయాన్ని గుర్తు చేస్తోంది.

Also Read: జీహెచ్ఎంసీలో కేసీఆర్ కు ఉద్యోగుల దెబ్బ

ఈ  విషయాన్నే కోర్టు దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. దీంతో శుక్రవారం ఉదయం ఇచ్చిన తీర్పును హైకోర్టు పునః పరిశీలించాలని ఎస్ఈసీ కోరింది. దీనిపై హైకోర్టు ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే..!

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్