LPG Gas Cylinder : దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం( central government) షాక్ ఇచ్చింది. గృహ అవసరాలకు సంబంధించి వంట గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా పెంచింది. ఒక్కో సిలిండర్ పై 50 రూపాయలను పెంచుతున్నట్లు ప్రకటించింది. కొత్త రేట్లు మంగళవారం తెల్లవారుజాము నుంచి అమల్లోకి వస్తాయని కూడా తేల్చి చెప్పింది. మరోవైపు ఉజ్వల పథకానికి కూడా పెంపుదల వర్తింపజేసింది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలను కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం. లీటర్ పక్కింటికి రెండు రూపాయల మేరపించింది. ఈ మేరకు కంపెనీలు కూడా ఓ ప్రకటన విడుదల చేశాయి.
Also Read : వల్లభనేని వంశీ మోహన్ కు బెయిల్.. వారు దయతలిస్తేనే!
* ఒకేసారి మూడు పెంపు.
చాలా రోజులుగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం లేదు. గ్యాస్ సిలిండర్ ( gas cylinder) ధర కూడా పెంచలేదు. కానీ ఇప్పుడు ఒకేసారి గ్యాస్ తో పాటు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సామాన్యుడికి మింగుడు పడని విషయం. పేద మధ్యతరగతి ప్రజల జీవన విధానం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. గృహ అవసరాల ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ పై 50 రూపాయల ధర పెరిగింది. ఉజ్వల పథకం కింద నిరుపేద కుటుంబాలకు అందజేస్తున్న సిలిండర్ల పైన ఈ తాజా వడ్డింపు వర్తింపజేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. రెండో గ్యాస్ సిలిండర్ కు సంబంధించి ఇటీవల ప్రకటన చేసింది. జూలై వరకు ఈ గ్యాస్ సిలిండర్ పొందవచ్చు అని స్పష్టం చేసింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పెరుగుదలతో ఏపీ ప్రభుత్వంపై భారం పడనుంది.
* ధర తగ్గించాల్సిందే..
మరోవైపు గ్యాస్ సిలిండర్ల ధర పెంపు, పెట్రోల్ డీజిల్ ధర పెంపుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి( Vijay Sai Reddy ) స్పందించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలతో పోలిక చేశారు. ఆ రేట్లను సైతం విశ్లేషించారు. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా తగ్గుతున్న పరిస్థితుల్లో పెట్రోల్, డీజిల్ ధర పెంచడం ఎంత మాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్ ఒక్కింటికి 60 డాలర్ల కంటే దిగువకు చేరిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. అయినా సరే ధరల పెంపు ఏంటని ప్రశ్నించారు. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 5 రూపాయలు తగ్గించే అవకాశం ఉందని సాయి రెడ్డి చెప్పుకొస్తున్నారు.
* కొద్ది రోజుల కిందట రాజీనామా..
కొద్ది రోజుల కిందటే వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి రాజీనామా చేశారు విజయ సాయి రెడ్డి. ఇకనుంచి తాను రాజకీయాలను మాట్లాడనని తేల్చి చెప్పారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ తరచూ పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈసారి కేంద్రంపై మాట్లాడడం కాస్త విడ్డూరంగా ఉంది. అయితే రాజకీయాలు చేయనని చెప్పిన విజయసాయిరెడ్డి.. రూటు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.