Tragedy: మరో ప్రేమ జంట కథ విషాదాంతమైంది. కలసి బతకాలన్న వారి కలలు కల్లలయ్యాయి. జీవితాంతం తోడుంటామని చేసుకున్న బాసలు అడియాశలయ్యాయి. భవిష్యత్ బంధనాలు విధించింది. నివురుగప్పిన నిప్పులా వారి ప్రేమకు అడ్డంకులు ఎదురయ్యాయి. ఇరు కుటుంబాల్లో పెద్దల అంగీకారం కుదరకపోవడంతో ఇక తనువు చాలించాలని భావించారు. అనుకున్నదే తడవుగా పురుగుల మందు తాగారు. చివరికి ప్రాణాలు కోల్పోయారు. కన్నవారికి గర్భశోకం మిగిల్చారు. కలిసుందామని అనుకున్నా విధి సహకరించక విగతజీవులుగా మారిపోయారు.

నల్గొండ జిల్లా అనుముల మండలం తెట్టేకుంట గ్రామంలో మట్టపల్లి కొండలు (21), అదే గ్రామానికి చెందిన సంధ్య (19) పరస్పరం ప్రేమించుకుంటున్నారు. జీవితంలో ఎదగాలని ఎన్నో కలలు కన్నారు. తమ ప్రేమను పండించుకోవాలని ఊసులు పంచుకున్నారు. కానీ కాలం మరోలా తలచింది. వారి ప్రేమ పెద్దలను ఒప్పించలేకపోయింది. ఇరు కుటుంబాల్లో అంగీకారం కుదరకపోవడంతో జీవితంపై విరక్తి చెందారు. ఇక ఈ లోకంలో బతకలేమని భావించారు. తనువు చాలించాలనే అనుకున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఊరి సమీపంలో పురుగుల మందు తాగారు. అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారు జామున తుతి శ్వాస విడిచారు. దీంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ప్రేమజంట ఆత్మహత్యపై పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.
పెద్దల అనుమతి లేదనే కారణంతో ప్రేమజంట ఆత్మాహుతి అందరిని కలచివేసింది. తొందరపాటు చర్యతో ఇరు కుటుంబాలు రోదిస్తున్నాయి. తమ బిడ్డలను తామే పొట్టన పెట్టుకున్నామని బంధువులు రోదిస్తున్న తీరు అందరిని కంట తడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పడుచుజంట మృతితో అందరి నోట అదే మాట వినిపిస్తోంది.
Also Read: Ileana: ఇలియానాకి వరుడు కావాలట.. అప్పుడు గర్భం రాలేదట !