
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఏపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి కోసం వేటలో పడ్డారా..? ఆ పదవికి ఎవరైతే సమర్థుడని తేల్చుకోలేకపోతున్నారా..? ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని ఎవరైతే గట్టెక్కించగలరు..? జగన్ దూకుడుకు ఎవరు కళ్లెం వేయగలరు..? ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టై బెయిల్ మీద బయటికొచ్చిన అచ్చెన్నాయుడికి అధ్యక్ష పదవి ఇవ్వాలనుకున్నా ఇప్పుడు ఎందుకు వెనక్కి తగ్గినట్లు..? అచ్చెన్నాయుడు వద్దన్నాడా..? లేక తనయుడు లోకేష్ అడ్డుపడ్డడా..? ఇప్పుడీ ప్రశ్నలన్నీ ఏపీ టీడీపీలో రాజ్యమేలుతున్నాయి.
ఈఎస్‌ఐ స్కామ్‌లో అరెస్టై, జైలుకు వెళ్లి వచ్చిన అచ్చెన్నాయుడిపై చంద్రబాబుకు సింపతి పెరిగిందట. అందుకే.. ఆయనను ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా చేయాలనుకున్నారట. దీనిపై ఎల్లో మీడియానే లీకులు ఇస్తూ వచ్చింది. ఇప్పటికే పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అధ్యక్షులను ప్రకటించిన టీడీపీ.. అధ్యక్షుడి పేరును మాత్రం వెల్లడించలేదు. ఏడాదిగా ఆ పదవిపై ఎన్నో ఊహాగానాలు వస్తున్నా ఇంతవరకు నియామకం లేకుండా పోయింది. అయితే.. 13 జిల్లాల పార్టీకి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉండగా.. తనయుడు లోకేష్ కూడా ముఖ్య నేతగా ఉన్నాడు. వీరిద్దరూ పోను మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఇంకొకరు అవసరమా అనే అభిప్రాయాలు కూడా పార్టీలో వినిపిస్తున్నాయట. అధ్యక్ష పదవి ఇచ్చినా ఎలాగూ డమ్మీనే. ఎందుకంటే చంద్రబాబు, లోకేష్‌ను కాదని నిర్ణయాలు చేసే ఆస్కారం ఉండదు. మరి మాటిమాటికి లీకులు ఇస్తూ చంద్రబాబు ఇలా అందరినీ ఎందుకు కన్‌ఫ్యూజ్ చేస్తున్నట్లు..?
సరే.. అచ్చెన్నాయుడికి పదవి ఇస్తానని డిసైడ్ అయిన చంద్రబాబు ఈ పాటికే ఆయన పేరును ప్రకటించాల్సి ఉంది. కానీ.. ఎందుకు ఇంత ఆలస్యం జరుగుతుందా అని అందరి మదిలోనూ తొలుస్తున్న ప్రశ్నం. అయితే.. ఈ పదవి చేపట్టడానికి అచ్చెన్నాయుడు ఆసక్తిగా లేడని తెలుస్తోంది. ఈఎస్‌ఐ స్కాంలో అసలు వాటాలు నొక్కింది నారా లోకేష్ అని.. ఆయన జైలుకు వెళ్లకుండా తనను బలి చేశారనే ఫీలింగ్ అచ్చెన్నాయుడిలో ఉంది. ఆ పదవి తీసుకున్నా పెద్దగా ఏమీ ఉండదు అనే భావనలో ఉన్నాడట. అందుకే.. తనకు ఆ పదవి వద్దన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నారా లోకేష్ కూడా అచ్చెన్నాయుడు నియామకాన్ని అడుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన వ్యక్తిగత లెక్కలేవో వేసుకొని పార్టీకి ఆయన సరిపోడంటూ నియామకానికి బ్రేక్ వేసినట్లు ప్రచారంలో ఉంది. మరి ఈ నేపథ్యంలో బాబు గారు ఆ పదవిని అచ్చెన్నాయుడికి ఇస్తారా..? లేదా మరో క్యాండిడేట్ కోసం వెతకాల్సిందేనా..? లేదా తామే ఇద్దరం ఉన్నాం మరొకరు ఎందుకని వదిలిపెడుతారా..? ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో ఇదే హాట్ టాపిక్ అయింది.