https://oktelugu.com/

Lokesh: లోకేష్ మంకుపట్టు.. టీడీపీ యువనేత నేత బలి?

Lokesh: మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంకుపట్టుకు ఆపార్టీకి చెందిన యువనేత బలవుతున్నారనే టాక్ మంగళగిరిలో బలంగా విన్పిస్తోంది. ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీలో కోటాలో నారా లోకేష్ మంత్రి పదవీని దక్కించుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన లోకేష్ తన శాఖను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆయన పనితీరుపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీగా, మంత్రిగా పని చేసిన నారా లోకేష్ గత అసెంబ్లీ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 28, 2021 / 11:19 AM IST
    Follow us on

    Lokesh: మాజీ సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంకుపట్టుకు ఆపార్టీకి చెందిన యువనేత బలవుతున్నారనే టాక్ మంగళగిరిలో బలంగా విన్పిస్తోంది. ఐదేళ్లు టీడీపీ అధికారంలో ఉండగా ఎమ్మెల్సీలో కోటాలో నారా లోకేష్ మంత్రి పదవీని దక్కించుకున్నారు. ఐటీ శాఖ మంత్రిగా పని చేసిన లోకేష్ తన శాఖను సమర్ధవంతంగా నిర్వహించారు. ఆయన పనితీరుపై ప్రతిపక్షాలు పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు గుప్పించడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

    Nara Lokesh

    ఎమ్మెల్సీగా, మంత్రిగా పని చేసిన నారా లోకేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నారా లోకేష్ కు ఆ ఎన్నికలు పీడకలను మిగిల్చాయనే చెప్పొచ్చు. లోకేష్ ను ఓడించేందుకు వైసీపీ పకడ్బంధీ వ్యూహాలతో దిగి మంగళగిరిలో వైసీపీ జెండా ఎగురవేసింది. వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో 6వేల ఓట్లతో నారా లోకేష్ ఓటమి కావడం టీడీపీ శ్రేణులను నిరుత్సాహానికి గురిచేసింది.

    Also Read: Nara Lokesh: నారా లోకేష్ కు దారేది..?

    టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అమరావతి అంటూ చంద్రబాబు నానా హడావుడి చేశారు. ఆ ప్రాంతంలో ఆయన తనయుడు లోకేష్ ఓటమి పాలవడం ఆపార్టీకి మింగుడు పడటం లేదు. ఇదిలా ఉంటే రాబోయే ఎన్నికల్లో మంగళగిరి సీటును గెలిచి తన తండ్రికి గిప్ట్ ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నారు. ఆమేరకు మంగళగిరి నియోజకవర్గంలో ఆయన విస్కృతంగా పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిపై వస్తున్న వ్యతిరేకత కూడా తనకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు.

    ఇక 2014 ఎన్నికల్లో మంగళగిరి నుంచి గంజి చిరంజీవి టీడీపీ తరుఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కేవలం 12ఓట్లతో చిరంజీవి ఓటమిపాలయ్యాడు. ఆ తర్వాత ఆయనకు పార్టీ మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్ పదవీని ఇచ్చింది. కాగా 2019లో చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ మంగళగిరి సీటు ఆశించడంతో చిరంజీవికి నిరాశ ఎదురైంది. అయితే ఆ ఎన్నికల్లో లోకేష్ 6వేల ఓట్ల తేడాతో ఓటమి పాలవడం చిరంజీవికి కలిచ్చేలా మారింది.

    వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేయాలని చిరంజీవి ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే లోకేష్ మంగళగిరి స్థానంలోనే పోటీ చేస్తానని మంకుపట్టు పడుతుండటంతో చిరంజీవి ఎమ్మెల్యే ఆశలు నెరవేరేలా కన్పించడం లేదు. దీంతో ఇటీవల మంగళగిరి పర్యటనకు వచ్చిన లోకేష్ బాబుతో మీరు ఇక్కడ నుంచి పోటీ చేస్తే తన సంగతి ఏంటీ పలువురు టీడీపీ నేతల ముందే ప్రశ్నించారని తెలుస్తోంది. ఆ తర్వాత చిరంజీవిని పిలిపించుకొని లోకేష్ నచ్చజెప్పారట.

    ప్రకాశం జిల్లా చీరాలలో పద్మశాలీ సామాజిక వర్గం బలంగా ఉందని.. అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని చిరంజీవికి లోకేష్ చెప్పారని తెల్సింది. తనకు మంగళగిరి సీటు ఎలాగూ దక్కదని అర్ధమైన చిరంజీవి ఇప్పటికే పలుమార్లు చీరాలకు వెళ్లి అక్కడి పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నాడు.

    ప్రస్తుతం చీరాల ఇన్ ఛార్జిగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎడం బాలాజీ ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పద్మశాలీకి చెందిన పోతుల సునిత చీరాల నుంచి పోటీ చేసి 10వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ పాచిక పారలేదు. దీంతో లోకేష్ కోసం చిరంజీవి బలిపశువుగా మారబోతున్నారనే టాక్ ఆపార్టీలోనే విన్పిస్తోంది.

     

    Also Read: CM Jagan: కళాకారుల ప్రతీకారం అధికారానికే ముప్పు.. జగన్ ఆలోచించు !