మహేష్ ప్లేస్ లో పవన్.. దిల్ రాజు ప్లాన్ !

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ చెప్పాను, మహేష్ కి బాగా నచ్చింది అని ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరక్టర్ అనిల్ రావిపూడి మీడియాకు సగర్వంగా చెప్పుకొచ్చాడు. అయితే అనిల్ ఇంటర్వ్యూల్లో గర్వంగా చెప్పుకున్నా.. అసలు ఇప్పట్లో మహేష్ బాబు డేట్ లు అనిల్ కి దొరికేలా లేవు. మహేష్ బాబు ఆగస్టు నుండి సర్కారువారిపాటతో బిజీగా ఉన్నాడు.   ఆ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాని స్టార్ చేస్తాడు. త్రివిక్రమ్ సినిమా […]

Written By: admin, Updated On : June 8, 2021 11:11 am
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ చెప్పాను, మహేష్ కి బాగా నచ్చింది అని ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరక్టర్ అనిల్ రావిపూడి మీడియాకు సగర్వంగా చెప్పుకొచ్చాడు. అయితే అనిల్ ఇంటర్వ్యూల్లో గర్వంగా చెప్పుకున్నా.. అసలు ఇప్పట్లో మహేష్ బాబు డేట్ లు అనిల్ కి దొరికేలా లేవు. మహేష్ బాబు ఆగస్టు నుండి సర్కారువారిపాటతో బిజీగా ఉన్నాడు.

 

ఆ సినిమా తరువాత త్రివిక్రమ్ సినిమాని స్టార్ చేస్తాడు. త్రివిక్రమ్ సినిమా పాన్ ఇండియా మూవీ, ఈ సినిమా పూర్తయ్యే సరికి 2022 నవంబర్ అవుతుంది. ఇక సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ అనుకుంటున్నారు. అంటే, మహేష్ 2023 వరకు ఫుల్ బిజీ. అంటే మరో రెండున్నర సంవత్సరాలు సమయం ఉంది. ఈ లోపు మహేష్ బాబు మళ్ళీ మనసు మార్చుకోవచ్చు, లేదా అని అనిల్ చెప్పిన కథ అప్పటికి ఫేడ్ అవుట్ అవ్వొచ్చు.

కాబట్టి, అనిల్ రావిపూడి, మహేష్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది. అందుకే అనిల్ రావిపూడిని వేరే ప్రాజెక్టు మీదకు తీసుకురావాలని నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజుకి మరో సినిమా చేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ రీమేక్, హరిహర వీరమల్లు అంటూ రెండు చిత్రాలను చేస్తున్నాడు,

అలాగే హరీష్ శంకర్ తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాల తరువాత పవన్, దిల్ రాజుకే డేట్స్ ఇచ్చాడు. కాబట్టి, నిర్మాత దిల్ రాజుకు ఇప్పుడు ఒక స్టార్ డైరెక్టర్ కావాలి. అందుకే అనిల్ రావిపూడిని పవన్ కళ్యాణ్ కు ముడి వేయాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడు. కానీ ఎఫ్ 3 తరువాత అనిల్ రావిపూడి బాలకృష్ణతో సినిమా చేయనున్నాడు.

బాలయ్యతో సినిమా తర్వాత, అనిల్ రావిపూడి – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నారు మేకర్స్. అనిల్ రావిపూడి అయితే తనకు ఓకే అని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అనిల్ రావిపూడి కూడా పవన్ తో సినిమా అంటే ఎలాగూ ఆసక్తి చూపిస్తాడు.