Nara Lokesh- Nadendla Manohar: గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఓ ఫోటో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇద్దరు నేతలు కలిసి కరచలనం చేసిన ఫోటో ఒకటి ఆకట్టుకుంటుంది. ఆ నేతల వారసులు అంటూ వైసిపి సోషల్ మీడియా వింత ప్రచారానికి తెరతీసింది. ఇంతకీ ఆ నేతలు ఎవరంటే అందరికీ సుపరిచితులే. ఆ ఇద్దరూ మాజీ సీఎంల కుమారులే.
ఇటీవల టిడిపి, జనసేన సమన్వయ కమిటీల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో పొత్తు అనంతరం నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో జనసేన సమన్వయ కమిటీని ప్రకటించింది. అటు తెలుగుదేశం పార్టీ సైతం సీనియర్ నేతలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. తొలిసారిగా పవన్, లోకేష్ ల ఆధ్వర్యంలో రాజమండ్రిలో రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. తాజాగా మరోసారి విజయవాడలో రెండు సమన్వయ కమిటీల సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు. కానీ ఈసారి పవన్ హాజరు కాలేదు. జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ లీడ్ తీసుకున్నారు. లోకేష్ సైతం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరు నేతలు కరచలనం చేశారు. ఆ ఇద్దరూ మాజీ ముఖ్యమంత్రుల కుమారులు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే వీరిద్దరి తండ్రులు ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన వారేనంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం అవుతోంది. వైసీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు ఆ పార్టీలో చేరారు. ఎన్టీఆర్కు అన్ని విధాలా సహకారం అందించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో నమ్మకంతో కొన్ని బాధ్యతలను ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావుకు అప్పగించారు. ఈ తరుణంలోనే టిడిపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో… ఎన్టీఆర్ విదేశాల్లో ఉండగా.. నాదెండ్ల భాస్కరరావు పార్టీని హస్తగతం చేసుకున్నారు. ఎన్టీఆర్ పై తిరుగుబాటుబావుట ఎగురవేశారు. అయితే ఈ కుట్రను ఎన్టీఆర్ ఛేదించారు. పార్టీని తిరిగి పొందగలిగారు. నాదేండ్ల ఎపిసోడ్ తర్వాత 1995 ఆగస్టులో మరో సంక్షోభం ఎదురైంది. చంద్రబాబు రూపంలో ఎన్టీఆర్ కు జలక్ తగిలింది. పార్టీ శ్రేణులతో తిరుగుబాటు బావుట ఎగరవేసిన చంద్రబాబు ఎన్టీఆర్ నుంచి టిడిపిని హస్తగతం చేసుకోగలిగారు. ఈ రాష్ట్రానికి సీఎం కాగలిగారు. అయితే ఈ పరిణామంతో కొద్ది రోజులకే ఎన్టీఆర్ మృతి చెందారు.
తాజాగా నాదెండ్ల మనోహర్, లోకేష్ కలయికలతో వైసీపీ తన చేతికి పని చెప్పింది. తండ్రులు ఇద్దరు అలా.. కుమారులు ఇద్దరు ఇలా.. అంటూ సెటైరికల్ గా ఫోటో జత చేస్తూ తెగ ప్రచారం చేస్తోంది. ఎన్టీఆర్ కి ఎదురైన పరిణామాలు గుర్తుకు తెచ్చేలా సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ గా మారింది. నెటిజెన్లు విభిన్నంగా కామెంట్స్ పెడుతున్నారు.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Lokesh and nadendla manohar reminding their fathers photo viral
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com