Homeజాతీయ వార్తలుIndia Delimitation Analysis: దేశంలో లోక్‌సభ సీట్ల పెంపు.. వ్యతిరేకిస్తున్న విపక్షాలు.. డీలిమిటేషన్‌ విశ్లేషణ

India Delimitation Analysis: దేశంలో లోక్‌సభ సీట్ల పెంపు.. వ్యతిరేకిస్తున్న విపక్షాలు.. డీలిమిటేషన్‌ విశ్లేషణ

India Delimitation Analysis: దేశంలో 50 ఏళ్ల తర్వాత కేంద్రం లోక్‌సభ సీట్లు పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 543 సీట్లు ఉండగా వీటిని 850కి పెంచాలని కేంద్ర క్యాబినెట్‌ తీర్మానం చేసింది. అయితే ఇందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 84 అడ్డంకిగా మారింది. లోక్‌సభ సీట్ల పెంపుతోపాటు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించే బిల్లుపై చర్చించి రాజ్యాంగ సవరణ చేసేందుకు కేంద్రం ఏప్రిల్‌ 16, 17వ తేదీల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసింది. 2011 జనాభా లెక్కలపై ఆధారంగా సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. అయితే ఈ డీలిమిటేషన్‌ ప్రక్రియపై విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి.

రాజ్యాంగబద్ధ ప్రక్రియ..
డీలిమిటేసన్‌ను రాజ్యాంగబద్ధంగా చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఇందుకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేయనుంది. సుప్రీం కోర్టు సిట్టింగ్‌ లేదా రిటైర్డ్‌ న్యాయమూర్తి దీనికి చైర్మన్‌గా ఉంటారు. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నియమించిన సభ్యులు ఉంటారు. స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ చైర్మన్లు, ప్రతి రాష్ట్రం నుంచి 5 ఎంపీలు, 5 ఎమ్మెల్యేలు అసోసియేట్‌గా ఉంటారు. ఈ కమిషన్‌ సీట్ల పునర్విభజన, మహిళల రిజర్వేషన్‌ సూచనలు చేస్తుంది. ఇది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ.

చరిత్రలో సీట్ల పెంపు ఇలా..
దేశంలో మొదటి పార్లమెంటు ఎన్నికలు జరిగిన 1952లో లోక్‌సభ సీట్లు 487 ఉండేవి. తర్వాత 1957 నాటికి సీట్ల సంఖ్య 494కు పెంచారు. 1966 నాటికి సీట్లు 520కి పెరిగాయి. 1977 నాటికి 543కు సీట్లు పెరిగాయి. 50 ఏళ్లుగా ఈ సీట్లు కొనసాగుతున్నాయి. 84వ రాజ్యాంగ సవరణ (2001) ప్రకారం 2026 జనాభా లెక్కల తర్వాతే (2036లో) పునర్విభజన అని నిర్దేశించింది. దీని సవరణతో తొందర అమలు సాధ్యం.

విపక్షాల అభ్యంతరాలు..
కేంద్రం చేసిన ప్రతిపాదనతో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని, లోక్‌సభలో ప్రాదినిధ్యం తగ్గుతుందని విపక్షాలు అభ్యంతరం చెబుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల ప్రజలు కుటుంబ నియంత్రణ పాటించారని, దీంతో జనాభా పెరగలేదని, ఉత్తరాదివాళ్లు జనాభా నియంత్రణ పాటించకపోవడంతో జనాభా పెరిగిందని పేర్కొంటున్నాయి. జనాభా ప్రాతిపదికన దక్షిణాది సీట్లు తగ్గుతాయని అభ్యంతరం తెలుపుతున్నాయి. ఇక మహిళా రిజర్వేషన్‌ అమలుకు కూడా 2036 వరకు ఆగాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

వాస్తవాలు ఇవీ..
1961 జనాభా ఆధారంగా 543 సీట్లు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. 1980ల్లో దక్షిణాది 179 సీట్లు (33శాతం) ఉన్నాయి. పునర్విభజన తర్వాత కూడా 34 శాతానికి సీట్లు పెరుగుతాయి. సీట్లు తగ్గడం లేదు, పెరుగుతున్నాయి. ఇక తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి 50 శాతం సీట్లు జనాభా ప్రాతిపదికన, 50 శాతం సీట్లు జీఎస్‌డీపీ ఆధారంగా పెంచాలని ప్రతిపాదించారు. ఇలా చేస్తే తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌ ఎక్కువ సీట్లు పెరుగుతాయి. తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలకు తగ్గుతాయి. ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఓటు బ్యాంకు రాజకీయం.

వ్యతిరేకకించడమే లక్ష్యంగా..
కేంద్రం ఏ ప్రతిపాదన చేసినా, ఏ బిల్లు పెట్టినా వ్యతిరేకించడమే లక్ష్యంగా విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. అవసరమైన సవరణలు, సూచనలు చేయడం లేదు. గతంలో ఆర్టికల్‌ 370ను వ్యతిరేకించాయి. ఎన్‌ఆర్సీని వ్యతిరేకించాయి. కామ¯Œ సివిల్‌ కోడ్‌ను వ్యతిరేకించాయి. బీజేపీ నిర్ణయాలను సహేతుక కారణాలు లేకుండా వ్యతిరేకిస్తున్నాయి.

కేంద్రం డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌కు రాజ్యాంగబద్ధ మార్గంలో ముందుకు సాగుతోంది. 543 నుంచి 850 సీట్లకు పెంపు జనాభా న్యాయం. దక్షిణాది సీట్లు తగ్గడం లేదు. విపక్షాలు ఓటు బ్యాంకు రాజకీయం కోసం వాదనలు చేస్తున్నాయి. పార్లమెంట్‌ సమావేశాలు దీనికి మార్గం సుగమం చేస్తాయి. మహిళల రాజకీయ ప్రాతినిధ్యం పెరుగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ ను రేవంత్ వదులుకోరు.. ఎందుకంటే..

HYDRA Ranganath: హైకోర్టు వ్యాఖ్యల తర్వాత.. భారత రాష్ట్ర సమితి.. భారతీయ జనతా పార్టీ హ్యాపీగా ఉండవచ్చు. కొంతమంది కబ్జాదారులు కూడా సంతోషంగా ఉండవచ్చు. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో రేవంత్ రెడ్డి...

Hot vs Cold Shower: వేడి నీరు.. చల్లటి నీరు.. ఏ స్నానం మంచిది..

Hot vs Cold Shower: ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల కేవలం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం మాత్రమే కాదు.. మానసికంగా కూడా ఉల్లాసంగా ఉంటుంది. అయితే వేడినీటితో స్నానం చేయడం మంచిదా?...

Today 28 July 2026 Horoscope: ఈ రాశి వారికి ఈ రోజు పదోన్నతి వచ్చే అవకాశం.....

Today 28 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాషాడ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారు ఈ రోజు అనుకోకుండా ధన లాభం...

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...
Oktelugu Epaper
Exit mobile version