Homeజాతీయ వార్తలుLok Sabha Election Results 2024: బీజేడీని దెబ్బకొట్టిన బీజేపీ..

Lok Sabha Election Results 2024: బీజేడీని దెబ్బకొట్టిన బీజేపీ..

Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్‌ మిస్‌ అయినా.. ఒడిశాలో మాత్రం రీచ్‌ అయింది. ఇక్కడ బీజేడీతో కలిసి మొదట పోటీ చేయాలని బీజేపీ భావించింది. ఇందుకోసం సీఎం నవీన్‌పట్నాయక్‌తో చర్చలు కూడా జరిపారు. కానీ, పొత్తు కుదరలేదు. దీంతో ఒంటరిగా బరిలోదిగాయి బీజేపీ, బీజేడీ. ఎన్నికల ఫలితాలు చూస్తుంటే బీజేడీ విజయానికి బీజేపీ భారీగా గండి కొట్టింది. రికార్డు సీఎం కావాలన్న నవీన్‌ పట్నాయక కళను చెరిపేసింది. అసెంబ్లీ స్థానాల్లో 77 సీట్లు బీజేపీ లీడ్‌లో ఉంది.

కర్నాటకలో కూడా సక్సెస్‌..
ఇక బీజేపీ వ్యూహం కర్నాటకలో కూడా పనిచేసింది. ఇక్కడ కూడా కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పటికీ మెజారిటీ లోక్‌సభ స్థానాలను బీజేపీ, బీజేడీ కూటమి సొంతం చేసుకునే దిశగా ట్రెండ్స్‌ వస్తున్నాయి.

యూపీలో పనిచేయని అయోధ్య మంత్రం..
ఇక అదే బీజేపీ అధికారంలో ఉన్న యూపీలో మాత్రం దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. ఇక్కడి 80 స్థానాల్లో బీజేపీ కేవలం 38 స్థానాల్లోనే ఆధిపత్యం కనబరుస్తోంది. అయోధ్య రామమందిరం నిర్మించి, అయోధ్యను కనీవినీ ఎరగని రీతిలో అభివృద్ధి చేసినా అక్కడి ఓటర్లు బీజేపీని ఆదరించలేదు. 2019 ఇక్కడ బీజేపీకి 60 స్థానాలు వచ్చాయి. ఈసారి సగానికి పడిపోయింది.

రాజస్థాన్‌లో టఫ్‌ ఫైట్‌..
ఇక బీజేపీ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం రాజస్థాన్‌. ఇక్కడ కూడా బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏడాది తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ తీవ్రంగా నష్టపోయింది.
బెంగాల్‌లోనూ నష్టం..
ఇక పశ్చిమబెంగాల్‌లోనూ బీజేపీ తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడ 2019లో బీజేపీ 15 స్థానాలు గెలిచింది. ఈసారి కేవలం 9 స్థానాల్లో మాత్రమే ఆధిపత్యం కనబరుస్తోంది.

తమిళనాడు, కేరళలో నష్టం..
ఇక తమిళనాడు, కేరళలో కూడా బీజేపీకి నష్టమే జరిగింది. ఈసారి కచ్చితంగా తమిళనాడులో సీట్లు వస్తాయని కమలనాథులు ఆశించారు. కానీ ఇక్కడ ఒకటి రెండు స్థానాల్లో మొదట ఆధిపత్యం కనబర్చిన బీజేపీ తర్వాత వెనుకబడింది. ఇక కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో బీజేపీ కనీసం పోటీ ఇవ్వలేదు. ఇక్కడ ఇండియా కూటమి ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version