
తెలంగాణలో లాక్ డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. బయట తిరిగితే జరిమానా విధిస్తున్నారు. ఉదయం పది గంటల తరువాత బయట కనిపిస్తే ఉపేక్షించడం లేదు. వాహనాలు, కార్లు సీజ్ చేస్తూ హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. ఎవరినీ వదిలిపెట్టమని పోలీసులు చెబుతున్నారు. కరోనా వైరస్ విస్తరిస్తున్నర వేళ సెకండ్ వేవ్ లో లాక్ డౌన్ ఒక్కటే శరణ్యమని భావించి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నగరాలతో పాటు జిల్లా కేంద్రాలు, పట్టణాలు సైతం నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. కరోనాకు తోడు బ్లాక్ ఫంగస్ సైతం తన విశ్వరూపం చూపిస్తున్న క్రమంలో ప్రజలు జంకుతున్నారు. ఎలాగైనా రోగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం, ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందే.
హైదరాబాద్ తోపాటు జిల్లాలు సైతం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేసేందుకు ఉపక్రమించాయి. హైదరాబాద్ లో సీపీ అంజనీ కుమార్ పంజాగుట్ట, బంజారాహిల్స్, బేగంపేట ప్రాంతాల్లో లాక్ డౌన్ ను పరిశీలించారు. దిల్ షుక్ నగర్ ప్రాంతంలో లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నా పెద్ద సంఖ్యలో వాహనాలు రావడంతో పోలీసులు తనిఖీ చేసి కార్లు, ద్విచక్రవాహనాలను సీజ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. కర్ఫ్యూ నిబంధనలు కఠినంగా అమలు చేసి కరోనా రక్కసిని రూపుమాపాలని భావిస్తున్నారు.
నిబంధనలు పాటించాల్సిందే
లాక్ డౌన్ సమయంలో నిబంధనలు పాటించాల్సిందే. ఉదయం పది గంటల తరువాత ఎవరైనా బయట తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అలాంటి వారిపై కేసులు సైతం నమోదు చేస్తున్నారు. దీంతో అన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. ఎలాంటి అనుమతి లేకుండా బయట తిరుగుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు గూడ్స్ వాహనాలకు అనుమతి ఉందని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేస్తామని చెబుతున్నారు.
కరోనా విస్తరిస్తున్నవేళ ప్రపంచమే వణుకుతోంది. దీంతో అన్ని ప్రాంతాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తన ప్రభావాన్ని చ ూపుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలకు లాక్ డౌన్ తప్ప మరే మర్గం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో అన్నిప్రాంతాలు కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తోంది. దీనికి ప్రజలు సైతం సహకరిస్తున్నారు. కరోనా వైరస్ ను వ్యాప్తి చెందకుండా చూసే క్రమంలో లాక్ డౌన్ శరణ్యమనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది.