Homeజాతీయ వార్తలుDelhi Liquor Scam- MLC Kavitha: లిక్కర్‌ కింగ్‌ కేజ్రీవాల్‌.. లిక్కర్‌ క్వీన్‌ కవిత.. ట్విట్టర్‌లో...

Delhi Liquor Scam- MLC Kavitha: లిక్కర్‌ కింగ్‌ కేజ్రీవాల్‌.. లిక్కర్‌ క్వీన్‌ కవిత.. ట్విట్టర్‌లో ఇదే ట్రెండింగ్‌!!

Delhi Liquor Scam- MLC Kavitha: ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముద్దుల తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేరు మారుమోగుతోంది. కవిత బహిరంగంగా బయటకు వచ్చి నిర్దోషి అని చెప్పినప్పటికీ, ఆమెను విపక్షాలు టార్గెట్‌ చేశాయి. ఒక దశలో విపక్షాలకు చెక్‌ పెట్టేందుకు కవిత చివరకు కోర్టు నుంచి స్టే కూడా తెచ్చుకున్నారు. అయినా విమర్శల దాడి ఏమాత్రం ఆగలేదు. దీంతో దర్యాప్తు సంస్థల నుంచి ఎలాంటి నోటీసులు అందలేదంటూ కవిత తప్పించుకుంటూ వచ్చారు. అయితే దర్యాప్తు సంస్థల తాజా నివేదికల్లో కవిత పేరు ఉంది. ఆశ్చర్యకరమైన నివేదికలు సౌత్‌ గ్రూప్‌ (శరత్‌రెడ్డి, కె.కవిత, మాగుంట శ్రీనివాసులరెడ్డి) ద్వారా రూ. 100 కోట్ల కిక్‌ బ్యాక్‌లు చెల్లించినట్లు ఈడీ నివేదికలో పేర్కొంది. ఈమొత్తాని విజయ్‌ నాయర్‌ అందుకున్నట్లు నివేదికలో వెల్లడించింది.

Delhi Liquor Scam- MLC Kavitha
MLC Kavitha

32 పేజీల్లో 36 మంది పేర్లు..
పీఎంఎల్‌ఏ చట్టం కింద ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ సిస్టమ్‌లో మనీలాండరింగ్‌కు సంబంధించిన దర్యాప్తు పేర్లను ఈడీ వెల్లడించింది. 32 పేజీల నివేదికలో మొత్తం 36 మంది పేర్లు పేర్కొనగా, సౌత్‌ గ్రూప్‌ కింద కె.కవిత, శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్లు స్పష్టంగా ఉన్నాయి.

లిక్కర్‌ క్వీన్‌ పేరుతో ట్రోలింగ్‌..
ఇన్నాళ్లూ తనకు నోటీసులు రాలేదని, ఢిల్లీ లిక్కర్‌ స్కాంతో తనకు సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూతురు కవిత. తాజాగా ఈడి కోర్టుకు ఇచ్చిన నివేదికలో ఆమె పేరు చేర్చడంతో లిక్కర్‌ క్వీన్‌ పేరుతో నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. కవిత నిత్యం యాక్టివ్‌గా ఉండే ట్విట్టర్‌తోపాటు ఇతర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో లిక్కర్‌ క్వీన్‌ పేరుతోనే కవిత ఇప్పుడు ట్రెండ్‌ అవుతోంది.

ఢిల్లీలో ఆప్‌.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌..
ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై ఈడీ నివేదిక నేపథ్యంలో ఢిల్లీలో అధికార ఆమ్‌ ఆద్మీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియాను కూడా నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఇక సౌత్‌ నుంచి టీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ, సీఎం కేసీఆర్‌ కూతురు పేరు నివేదికలో చేర్చడంతో నెటిజన్లు టీఆర్‌ఎస్‌తోపాటు, కవితను ట్రోల్‌ చేస్తున్నారు. కేజ్రీవాల్‌ను నెటిజన్లు ‘లిక్కర్‌ కింగ్‌‘ అని ఎగతాళి చేస్తుంటే, కవిత ఇప్పుడు ‘లిక్కర్‌ క్వీన్‌‘ అని లేబుల్‌ చేయబడింది. గులాబీ పార్టీని దెబ్బతీసేందుకు బీజేపీ ఇలాంటి పనిచేస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ జాతీయ రాజకీయాల్లోకి రావాలనుకుంటోందని, అందుకే కాషాయ పార్టీ తమను లక్ష్యంగా చేసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.

Delhi Liquor Scam- MLC Kavitha
MLC Kavitha

సౌత్‌ పాలిటిక్స్‌లో ప్రకంనలు..
ఇటీవల, అరబిందో ఫార్మా హోల్‌ టైమ్‌ డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డిని 3 రోజుల పాటు విచారణ చేసిన తర్వాత ఈడీ ఢిల్లీలో అరెస్టు చేసింది. శరత్‌ వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ, విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్‌రెడ్డికి అన్నయ్య.

మొత్తంగా ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన లింకులు దక్షిణాదిన ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీకి చెందిన నేతల పేర్లు ఉండడం సౌత్‌ పాలిటిక్స్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version