Lalu Prasad Daughters: ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదంటారు.. ఈ సామెత మిగతా విషయాల్లో ఏమో గాని.. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి మాత్రం నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది. ఎందుకంటే అవినీతి అనేది లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి కేరాఫ్ అడ్రస్ లాంటిది.. అవినీతి, అక్రమాలు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి ముంజేతి కంకణం లాంటివి.. ఎన్ని రకాలుగా అక్రమాలకు పాల్పడినప్పటికీ.. ఎన్ని రకాలుగా ఘోరాలు చేసినప్పటికీ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం ఇప్పటికి బీహార్ రాష్ట్రాన్ని తమ సొంత ఆస్తిగా భావిస్తూ ఉంటుంది.. పైగా అక్కడ కుల రాజకీయాలు చేయడం లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్య.
దశాబ్దాలపాటు బీహార్ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన సాగించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు వయోభారం వల్ల విశ్రాంతి తీసుకుంటున్నారు.. ఆయన కుమారుల్లో తేజస్వి యాదవ్ ఆర్ జె డి బాధ్యతలు పర్యవేక్షిస్తున్నారు. మరో కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కుటుంబం నుంచి వెళ్లి పోయాడు. పార్టీ నుంచి కూడా వెళ్లిపోయాడు. సొంతంగా పార్టీ పెట్టుకున్నప్పటికీ ఇటీవల ఎన్నికలలో ఓటమిపాలయ్యాడు.
ఇప్పుడు ఆర్ జె డి నుంచి లాలు కుమార్తె రోహిణి యాదవ్ వెళ్లిపోయింది. కుటుంబ బంధాలను కూడా తెంచుకుంటున్నట్టు వెల్లడించింది.. పైగా తన కుటుంబంలో కొంతమంది తిట్టారని.. చెప్పులతో కొట్టడానికి ప్రయత్నించారని.. అందువల్ల తాను బయటికి వచ్చానని రోహిణి ప్రకటించింది.
వాస్తవానికి లాలు కుటుంబంలో అందరూ వివాదాస్పదులే.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టునమేస్తుందా అనే సామెత చందంగా.. లాలు కుటుంబ సభ్యులు కూడా అడ్డగోలుగా అవినీతికి.. అక్రమాలకు పాల్పడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ కు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ఏడుగురు కుమార్తెలను అత్యంత తెలివిగా లాలు బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాజకీయ కుటుంబాల అబ్బాయిలకు ఇచ్చి వివాహాలు జరిపించాడు. తన రాజకీయ విస్కృతిని మరింత సుస్థిరం చేసుకోవడానికి ఆయన ఈ ఎత్తుగడవేశాడు..
లాలు పెద్ద కుమార్తె మీసా భారతి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఈమె మీద భూ ఆక్రమణ కేసులున్నాయి. రెండవ కుమార్తె రాగిణి యాదవ్ ల్యాండ్ ఫర్ జాబ్ స్కాం లో ఇరుక్కుపోయింది. ఈ మన కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి.. చందా యాదవ్ మూడవ కుమార్తె. ఈమెకు రాజకీయాలతో సంబంధం లేకపోయినప్పటికీ.. పరోక్షంగా కొన్ని విషయాలను ప్రభావితం చేసిందని.. అందుకోసం డబ్బు తీసుకుందని ఆరోపణలు ఉన్నాయి..
మరో కూతురు హేమా యాదవ్ కు రాజకీయ వాసనలు ఉన్నాయి. ఈమె భర్త ఢిల్లీలో రాజకీయాలు చేస్తుంటారు.. మరో కుమార్తె అనుష్క యాదవ్.. ఈమె భర్త చిరంజీవి రావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.. హర్యానా రాష్ట్రంలోని రేవారి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నారు..
మరో కుమార్తె పేరు రాజ్ లక్ష్మీ యాదవ్.. ఈమె భర్త తేజ్ ప్రతాప్ సింగ్ యాదవ్ సమాజ్వాది పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నారు. ఉత్తరప్రదేశ్లో రాజకీయాలలో అత్యంత కీలకంగా ఉన్నాడు.. ఈయన యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కు స్వయాన మేనల్లుడు. లాలు కుటుంబం మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్న రోహిణి భర్త పేరు సమరేష్ సింగ్. ఇతడు కంప్యూటర్ ఇంజనీర్.. సింగపూర్ లో ఓ కంపెనీ ఉంది.