Homeఆంధ్రప్రదేశ్‌తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ పాలిటిక్స్‌

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ పాలిటిక్స్‌

Telugu States‌
రాజకీయాల్లో వారసత్వ రాజకీయాలు కామన్‌. అది ఇప్పుడు కాదు.. అనాధిగా వస్తూనే ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో గాంధీ కుటుంబానిదే హవా. అయితే.. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల్లోనూ ఈ తంతు కనిపిస్తోంది. పార్టీ అధినేతలకు తన వారసత్వాన్ని రాజకీయంగా కొనసాగించడం అనివార్యం. ప్రజామోదం ఉన్న వారికి ఖచ్చితంగా వారసత్వం కలసి వస్తుంది. చాలా రాష్ట్రాల్లోనూ అవి రుజువు అయ్యాయి కూడా. ఉత్తర్ ప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ ఒకసారి ముఖ్యమంత్రి కాగలిగినా, ఆయన నాయకత్వంలో పార్టీ ఓటమి పాలైంది.

Also Read: కంచుకోటకు బీటలు.. చంద్రబాబుకు ఏం మిగిలింది?

మరోవైపు.. తమిళనాడు ఎన్నికలను చూస్తే కరుణానిధి స్థానంలో ఆయన కుమారుడు స్టాలిన్‌కు పార్టీ పగ్గాలు అందాయి. త్వరలో జరిగే ఎన్నికల ఫలితాలు స్టాలిన్‌ను ప్రజలు ఆదరిస్తారా? లేదా? అన్నది తేలబోతుంది. కరుణానిధి బతికున్నంత వరకూ స్టాలిన్‌కు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం దక్కలేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా వచ్చిన వైఎస్ జగన్ స్వయం కృషితో ముఖ్యమంత్రి కాగలిగారు.

తెలంగాణలోనూ తాజాగా కేసీఆర్ తన కుమారుడికి ముఖ్యమంత్రి పదవి అప్పగించేది లేదని తెగేసి చెప్పారు. తాను పదేళ్ల కాలంపాటు ముఖ్యమంత్రిగా ఉంటానని కేసీఆర్ స్పష్టం చేశారు. వారసుడికి ఇంకా ప్రజామోదం లభించలేదని కేసీఆర్ అభిప్రాయపడి ఉండవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీలో అధినేత చంద్రబాబు తన వారసుడిని ఫోకస్ చేయాలని నిర్ణయించారు. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవిని కట్టబెట్టారు. పార్టీలో తన తర్వాత స్థానాన్ని చంద్రబాబు కల్పించారు.

Also Read: ఆ ఆరు పదవులూ వైసీపీవే..

అయితే.. ఇంతవరకు బాగానే ఉన్నా చంద్రబాబుకు ప్రస్తుతం వయసు పైబడుతోంది. దీంతో ఇప్పుడు టీడీపీలో ప్రత్యామ్నాయం కంపల్సరీ. అందుకే.. వెంటవెంటనే లోకేష్‌ను తెరమీదకు తెస్తున్నారు చంద్రబాబు. ఆయనను రాజకీయంగా మరింత ఫోకస్‌ చేయాలని చూస్తున్నారు. పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో ఈసారి ఎన్నికలకు కూడా చంద్రబాబు నేతృత్వం వహిస్తారు. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే లోకేష్ కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చే అవకాశమూ లేదు. ఎందుకంటే కేసీఆర్ పై కుటుంబపరమైన ఒత్తిళ్లు లేవు. కానీ.. చంద్రబాబు మాత్రం లోకేష్ విషయంలో కుటుంబపరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version