ఒక్కొక్కరుగా ‘హ్యాండ్‌’ ఇస్తున్న రేవంత్ వర్గీయులు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత పొజిషన్‌ రేవంత్‌ రెడ్డిది. ప్రత్యేక రాష్ట్రం విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా కనుమరుగైంది. దీంతో రేవంత్‌ ఉన్నట్టుండి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లో తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు. అయితే.. ఆయనకు పార్టీలో ముఖ్య పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా ఇటీవల జరిగింది. కానీ.. సీనియర్ల నుంచి సపోర్టు లేకపోవడం.. రేవంత్‌కు తప్ప ఎవరికి ఇచ్చినా ఓకే అంటూ […]

Written By: Srinivas, Updated On : March 16, 2021 1:44 pm
Follow us on


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత పొజిషన్‌ రేవంత్‌ రెడ్డిది. ప్రత్యేక రాష్ట్రం విషయంలో చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంతో రాష్ట్రంలో పార్టీ పూర్తిగా కనుమరుగైంది. దీంతో రేవంత్‌ ఉన్నట్టుండి కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి ఆయన కాంగ్రెస్‌లో తన ప్రస్తానం కొనసాగిస్తున్నారు. అయితే.. ఆయనకు పార్టీలో ముఖ్య పదవి అప్పగిస్తారనే ప్రచారం కూడా ఇటీవల జరిగింది. కానీ.. సీనియర్ల నుంచి సపోర్టు లేకపోవడం.. రేవంత్‌కు తప్ప ఎవరికి ఇచ్చినా ఓకే అంటూ అధిష్టానానికి లేఖలు రాశారు. దీంతో అప్పటి నుంచి పీసీసీ చీఫ్‌ పదవి ఆయనను ఊరిస్తూనే ఉంది.

Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే?

అయితే.. ఇప్పుడు రేవంత్‌ మరిన్ని కష్టాలు వచ్చిపడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ వర్గీయులుగా ముద్రపడిన వారందరూ ఒక్కొక్కరుగా బీజేపీ గూటికి చేరుతున్నారు. మొన్న కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి వంతు వచ్చింది. విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించకపోయినా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయనకు బీజేపీ తప్ప మరో మార్గం లేదు. ఆయన టీఆర్ఎస్ ఎంపీగా ఉండగా ముందస్తు అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీఆర్ఎస్‌తో విబేధించి రేవంత్ రెడ్డి చొరవతో కాంగ్రెస్‌లో చేరారు.

లోక్‌సభ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన ఆయన ఆ తర్వాత చురుగ్గా ఉన్నప్పటికీ కాంగ్రెస్‌లో అంతర్గత రాజకీయాలు ఆయనను వెనక్కి నెట్టేశాయి. టీఆర్ఎస్‌పై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న ఆయన సర్కార్‌‌పై పోరాడాలని గట్టిగా అనుకుంటున్నారు. కానీ.. కాంగ్రెస్‌లోని పరిస్థితులు ఏ మాత్రం ఆయనకు అనుకూలించడంలేదు. అదే విషయం చెప్పి పార్టీకి రాజీనామా చేశారు. ప్రభుత్వంపై పోరాటానికి కాంగ్రెస్ సిద్ధంగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్‌కు మరో కీలక నేత దూరమయ్యారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికలో కాంగ్రెస్ హైకమాండ్ నాన్చుతుండటంతో నేతల్లో నిరాశా నిస్పృహలు కనిపిస్తున్నాయి. పోరాడే నేతల్ని పట్టించుకోకుండా వర్గ రాజకీయాలకు తలొగ్గి.. పార్టీని నిస్తేజం చేస్తుండడంతో కార్యకర్తల్లో అసంతృప్తికి గురిచేస్తోంది.

Also Read: తప్పుగా బదిలీ చేసిన నగదును రివర్స్ లో ఎలా పొందాలంటే..?

ఓ వైపు కాంగ్రెస్ కేంద్రంగా కుట్రలు జరుగుతున్నాయని.. కాంగ్రెస్ పార్టీకి మిగిలి ఉన్న ఓటు బ్యాంక్‌ను కూడా.. చెల్లాచెదురు చేయడానికి కొత్త పార్టీలు ఏర్పాటు చేస్తున్నారన్న చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు మేలుకోవడం లేదు. హైకమాండ్ చివరికి ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితుల్లో రేవంత్‌పై నమ్మకం పెట్టుకున్న నేతలు కూడా.. ఒక్కొక్కరు వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ మేలుకుంటుందో లేదో చూడాలి మరి..!

Check this Space For More information on Telangana Political News