దేశంలో డిజిటల్ లావాదేవీలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చాలామంది ఆన్ లైన్ ద్వారా ఇతరులకు నగదు బదిలీ చేస్తున్నారు. అయితే పొరపాటున ఇతరుల ఖాతాల్లోకి నగదు జమైతే ఆ నగదును తిరిగి మన బ్యాంక్ ఖాతాలోకి పొందవచ్చు. పొరపాటున ఇతరుల ఖాతాల్లో నగదు జమైనట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంక్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి ఆ విషయం తెలియజేయాలి. లావాదేవీ జరిగిన టైమ్ డేట్ తో పాటు లావాదేవీకి సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాలి.
Also Read: రూ.2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్థిక శాఖ..!
కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ చెప్పిన వివరాలు అన్నీ సరిగ్గా ఉంటే 5 నుంచి 6 రోజుల్లో అకౌంట్ లో నగదును తిరిగి జమ అవుతుంది. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ కు ఫిర్యాదు చేయడం సాధ్యం కాని పక్షంలో తప్పుగా జరిగిన లావాదేవీలకు సంబంధించి మేనేజర్ కు వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. మేనేజర్ లావాదేవీకి సంబంధించిన వివరాలను పరిశీలించి బదిలీ అయిన సొమ్మును రికవరీ చేసే ప్రయత్నం చేస్తారు.
Also Read: క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిషేధం విధించనుందా..?
అయితే నగదు జమైన వ్యక్తి అనుమతి ఇస్తే మాత్రమే బదిలీ అయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. నగదు జమైన వ్యక్తి డబ్బు తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. నగదు జమైన వ్యక్తి అంగీకరిస్తే 8 నుంచి 10 రోజుల్లో ఖాతాల్లో నగదు జమయ్యే అవకాశం ఉంటుంది. నగదు జమైన వ్యక్తి అంగీకరించని పక్షంలో బ్యాంక్ లావాదేవీకి సంబంధించిన వివరాలు, చిరునామా, అడ్రస్ ప్రూఫ్ లను సమర్పించాల్సి ఉంటుంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
ఎలాంటి ఆన్ లైన్ లావాదేవీ జరిగినా ఈ విధంగా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం డబ్బు తిరిగి ఖాతాల్లో జమ కావడానికి ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది.