https://oktelugu.com/

అగ్గువకు విశాఖ భూములు.. 19 వేల ఎకరాలు 55 కోట్లేనట..!

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు కేంద్రం. ప్రైవేటీకరణ చేయడమేనని మరోసారి తేల్చిచెప్పింది. రుణాలు పెరిగిపోవడం, ఉత్పాదకత తగ్గిపోవడమే కారణమని పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ మరోసారి చెప్పారు. ఈ సారి కూడా.. వైసీపీ సభ్యుడే ప్రత్యేకంగా ప్రశ్న వేయించి చెప్పించారు. నష్టాలు పూడ్చడానికి సీఎం జగన్ ఏడు వేల ఎకరాల సలహాలను పదే పదే ఇస్తున్నారు. ఏడు వేల ఎకరాలు ప్లాట్లుగా వేసి అమ్మేస్తే.. స్టీల్ ప్లాంట్ నష్టాలన్నీ తీరిపోతాయని అంటున్నారు. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 16, 2021 1:55 pm
    Follow us on

    Visakha steel plant Lands
    విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు కేంద్రం. ప్రైవేటీకరణ చేయడమేనని మరోసారి తేల్చిచెప్పింది. రుణాలు పెరిగిపోవడం, ఉత్పాదకత తగ్గిపోవడమే కారణమని పార్లమెంట్‌లో నిర్మలా సీతారామన్ మరోసారి చెప్పారు. ఈ సారి కూడా.. వైసీపీ సభ్యుడే ప్రత్యేకంగా ప్రశ్న వేయించి చెప్పించారు. నష్టాలు పూడ్చడానికి సీఎం జగన్ ఏడు వేల ఎకరాల సలహాలను పదే పదే ఇస్తున్నారు. ఏడు వేల ఎకరాలు ప్లాట్లుగా వేసి అమ్మేస్తే.. స్టీల్ ప్లాంట్ నష్టాలన్నీ తీరిపోతాయని అంటున్నారు. కానీ స్టీల్ ప్లాంట్ మొత్తం భూముల విలువ రూ.55 కోట్లుగానే కేంద్రం లెక్క కట్టినట్లుగా నివేదికలు వెలుగులోకి వస్తున్నాయి.

    Also Read: రూ.2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్థిక శాఖ..!

    విశాఖ స్టీల్ ప్లాంట్ పేరు మీద భూములు లేవు. రాష్ట్రపతి మీదనే ఉన్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల కోసం భూసేకరణ చేసినప్పుడు ఇలాగే చేశారు. ఇప్పుడు.. స్టీల్ ప్లాంట్‌తో పాటు భూముల్ని కూడా విలువ కట్టి అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ భూములు 19,703 ఎకరాలను రూ.55 కోట్ల 82లక్షల రూపాయలుగా లెక్కగట్టారు. ఇదేం లెక్క అంటే.. భూసేకరణ జరిపినప్పుడు ఇదే విలువ ఉందట. ఈ కారణంగా అదే లెక్కను దాదాపు 50 ఏళ్ల తర్వాత చూపించి అమ్మకానికి పెట్టేస్తున్నారు. ఈ ఒక్క నిర్ణయంతోనే ఉక్కు కర్మాగారానికి సుమారు లక్ష కోట్ల రూపాయలకుపైగా నష్టం వాటిల్లబోతోంది.

    కేంద్రం నిర్ణయం కారణంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కొనుగోలు చేయబోయే సంస్థకు లక్ష కోట్ల రూపాయల లాభం వచ్చే అవకాశం ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది పెద్ద స్కాంగా కార్మిక సంఘాలు అనుమానిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్‌కు విలువ కట్టే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు ఇదే అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇప్పుడు విశాఖపట్నంలో భూముల విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ఐదేళ్ల కిందట కొన్న స్థలం విలువే రెట్టింపు అవుతుంటే యాభై ఏళ్ల కిందటి విలువలు మార్చకపోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఇదే పద్ధతిలో కేంద్రం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తే ప్రజలు తిరగబడటం మాత్రం ఖాయం.

    Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ఎవరిదంటే?

    ఇప్పుడు ఇంత తక్కువ ధరకు భూములు అమ్మకంపైనా ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కేంద్రం నిర్ణయంపై మరింత ఉద్యమం ఉవ్వెత్తున లేపాలని ప్రయత్నాలు సాగిస్తున్నారు. కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధపడుతున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్