Homeజాతీయ వార్తలుPoonam Kaur: ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టొద్దు.. మానభంగం జరిగిందా ?

Poonam Kaur: ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టొద్దు.. మానభంగం జరిగిందా ?

 Poonam Kaur
Poonam Kaur

Poonam Kaur: అందరిది ఒక బాధ అయితే.. పూనమ్ కౌర్ ది మరో బాధ అన్న చందంగా తయారైంది ఆమె పరిస్థితి. పవన్ కళ్యాణ్ పై ఇన్ డైరెక్ట్ గా అనేక ఆరోపణలు చేస్తూ.. మధ్యమధ్యలో పవన్ ను సపోర్ట్ చేస్తూ అసలు ఆమె బాధ ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా సాగుతుంది పూనమ్ ప్రవర్తన. ఏది ఏమైనా టాలీవుడ్ లో #pklove అనే హ్యాష్ ట్యాగ్ తో పూనమ్ ఎంతో వైరల్ అయింది. ఇక హిట్ అవ్వకుండానే ఫేడ్ అవుట్ అయిన ఈ పంజాబీ భామ తాజాగా మా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకుంది.

మొదటి నుంచి తాను ప్రకాష్ రాజ్ ప్యానల్ కు సపోర్ట్ చేస్తున్నాను అంటూ పబ్లిక్ గానే చెప్పుకుంటూ వస్తోన్న ఈ బ్యూటీ… మా ఎన్నికల్లో ఓటు వేసి వచ్చాక కూడా ‘తాను ప్రకాశ్ రాజ్ ప్యానల్ కే ఓటేశానని క్లారిటీ ఇచ్చింది. ఇక ఈ సందర్భంగా మా ఎన్నికల్లో రాజకీయాలు వద్దని’ అమ్మడు చిన్నపాటి మెసేజ్ కూడా ఇచ్చింది. పైగా రాజకీయ లబ్ది కోసం ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టొద్దని కూడా పూనమ్ చెప్పుకొచ్చింది.

అన్నట్టు రీసెంట్ గా పూనమ్(Poonam Kaur) ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే.. ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌ సర్‌ గెలవాలి. ఓ విషయంలో ఇంతకాలం నేను నిశబ్థంగా ఉన్నాను. ఒకవేళ ప్రకాశ్ రాజ్ గెలిస్తే పరిశ్రమలో నేను ఎదుర్కొన్న సమస్యలను చెప్పే అవకాశం నాకు ఉంటుంది. ఎందుకంటే ప్రకాశ్ రాజ్ వాస్తవికంగా ఉంటారు. ఆయన పై నాకు నమ్మకం ఉంది. ప్రకాష్ రాజ్ చెత్త రాజకీయాలు చేయరు. అందుకే ఆయనకు నా మద్దతు ఉంటుంది. జైహింద్‌’ ఇది పూనమ్ ట్వీట్‌ చేసింది. మరి ప్రకాష్ రాజ్ గెలిస్తే.. పూనమ్ ఏమి బయట పెడుతుందో చూడాలి.

మానభంగం జరిగిందా?

మా ఎన్నికల్లో భాగంగా ఓటేసేందుకు వచ్చిన ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ పోలింగ్ కేంద్రం వద్ద గొడవలపై స్పందించారు. ‘ఏం గొడవ? ఎన్నికలు అన్నాక గొడవలు జరగవా? మర్డర్లు, మానభంగాలు జరగట్లేదు కదా.. కామ్ గా, బ్రహ్మాండమైన ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి.. తప్పకుండా ఎవరో ఒకరు గెలుస్తారు.. 26 మందిలో 26 మందీ గెలుస్తారు.. ప్రెసిడెంట్ గా ఒకరు, వైస్ ప్రెసిడెంట్ గా ఒకరు గెలుస్తారు.. ఇంకేం కావాలి? కచ్చితంగా చెప్పాలంటే నేను ఓటేసిన వాళ్లే గెలుస్తారు..’ అని బండ్ల గణేశ్ అన్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version