MAA Elections: ప్రకాష్ రాజ్ నమస్కారం.. బాలక్రిష్ణ తిరస్కారం

MAA Elections Polling: ‘మా’ ఎన్నికల్లో కొందరికి ఖేదం.. కొందరికి మోదం లభించేలా కనిపిస్తోంది. రాజకీయ ఎన్నికలను తలదన్నేలా ఈసారి ‘మా’ ఎన్నికలను నిర్వహించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు, ప్రతివిమర్శలతో రెచ్చిపోయారు. ‘మా’ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో చాలా విషయాలే చోటు చేసుకుంటున్నాయి. ఉదయం ప్రత్యర్థులు కౌగిలించుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలో విష్ణు, ప్రకాష్ రాజ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అన్నిటికీ మించి ప్రకాష్ […]

Written By: NARESH, Updated On : October 10, 2021 4:20 pm
Follow us on

MAA Elections Polling: ‘మా’ ఎన్నికల్లో కొందరికి ఖేదం.. కొందరికి మోదం లభించేలా కనిపిస్తోంది. రాజకీయ ఎన్నికలను తలదన్నేలా ఈసారి ‘మా’ ఎన్నికలను నిర్వహించారు. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు వర్గాలు హోరాహోరీగా తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా విమర్శలు, ప్రతివిమర్శలతో రెచ్చిపోయారు.

prakashraj vs balaiah

‘మా’ ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో చాలా విషయాలే చోటు చేసుకుంటున్నాయి. ఉదయం ప్రత్యర్థులు కౌగిలించుకుని ముచ్చట్లు చెప్పుకున్నారు. ఈ క్రమంలో విష్ణు, ప్రకాష్ రాజ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అన్నిటికీ మించి ప్రకాష్ రాజ్ మరో అడుగు ముందుకేసి, మోహన్ బాబు కాళ్లకు మొక్కడం మొత్తానికి ఇక అంతా సుఖంతామే అనుకున్నారు. ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైంది. కానీ ఉదయం నుంచి మిగిలిన నటీనటుల మధ్య పోరు కొనసాగుతూ వచ్చింది.

‘మా’ ఎన్నికల కేంద్రంలో ఎవరి వర్గాలు వారిని తీసుకెళ్లి ఓటు వేయించారు. దొంగ ఓట్ల కలకలం కూడా చోటుచేసుకుంది. నటుడు నరేశ్ దొంగ ఓట్లు వేస్తున్నారని ఒకరి వెంట పడడం.. ప్రకాష్ రాజ్ అడ్డుకోవడంతో ఇద్దరూ మాటా మాట పెరిగి కొట్టుకోవడానికి కూడా రెడీ అయ్యారు. పక్కనున్న వారు సర్ధి చెప్పడంతో గొడవ సద్దు మణిగింది. ఇక నటుడు బెనర్జీపై మోహన్ బాబు పోలింగ్ బూత్ లో ఏకంగా కొట్టడానికి రెడీ అయ్యి ‘చంపేస్తా’నంటూ హెచ్చరించాడు.

ఇక మా ఎన్నికల్లో మంచు విష్ణు ప్యానెల్ కు సపోర్టుగా నిలిచిన బాలక్రిష్ణ ఓటు వేయడానికి వచ్చిన సమయంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బాలయ్యకు నవ్వుతూ వంగి నమస్కారాన్ని ప్రకాష్ రాజ్ పెట్టగా.. బాలక్రిష్ణ చూసినా స్పందించకుండా మొహం పక్కకు తిప్పుకొని పోవడం కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీడియాలో హైలెట్ అయ్యింది.