
Karimnagar: ప్రకృతిలో పరవశించే పలు దృశ్యాలు ఆవిషిష్కృతమవుతుంటాయి. అగ్ని పర్వతాలు బద్దలవడం, ఆకాశంలో మెరుపులు మెరవటం, సముద్ర కెరటాలు ఉప్పొంగడం వంటి సంఘటనలు చూస్తున్నాం. కరీంనగర్ జిల్లాకు గుండెకాయ లోయర్ మానేరు డ్యాం. ఇది వేలాది ఎకరాల్లో పంటలకు మూల కారణంగా మారుతోంది. దీంతో రైతులు తమ భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు. శనివారం సాయంత్రం ఎల్ఎండీలో అమెరికాలో తరచూ కనిపించే విపత్తు టోర్నడో ను పోలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఈ సుందర దృశ్యం కేంద్రీకృతమైంది ఎల్ఎండీలోనే. దీన్ని నెటిజన్లు తమ సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. దీంతో వేలాది లైకులు వచ్చాయి. ఇంత ఆకర్షించే దృశ్యం గత ఐదేళ్ల క్రితం కూడా ఇలాంటి టోర్నడో అందరిని ఆకట్టుకుంది. నీళ్లలో ఏర్పడిన దృశ్యంతో ఆకాశానికెగురుతున్న నీటిని తమ కెమెరాల్లో బంధించారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చునూర్ శివారులో దిగువ మానేరు జలాశయం బ్యాక్ వాటర్ తో ఈ అరుదైన దృశ్యం కనిపించింది. ఒక్కసారి సుడిగాలిలా మారి నిమిషాల్లోనే పెద్దదై నీళ్లు ఆకాశంలోకి వెళ్లాయి. దీంతో ప్రజల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. అరుదైన దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
దీంతో జిల్లాయే కాకుండా రాష్ర్ట వ్యాప్తంగా ఈ సుందర స్వప్నం అందరిని ఆకర్షించింది. లక్షలాది మంది వీక్షించి తమ కామెంట్లు పోస్టు పెట్టారు. అమెరికాలో చూసినట్లు ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అరుదైన ఘట్టాన్ని బంధించిన వారికి ప్రశంసలు దక్కాయి.
వీడియో
https://www.youtube.com/watch?v=enfLSjrivSg