
Donald Trump: డోనాల్డ్ ట్రంప్.. చాలా తుంటరి వ్యక్తి.. ఏదైనా ముఖం ముందే చెప్పేస్తుంటాడు. అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్ తీసుకున్న చాలా నిర్ణయాలు సంచలనంగా మారాయి. కొన్ని నిర్ణయాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేంత పనిచేయగా.. మరికొన్ని ప్రపంచస్థాయిలో మంచి గుర్తింపును పొందాయి. ట్రంప్ ఇలాకూడా చేస్తారా అని ప్రపంచం అతడిని మెచ్చుకునేంత పనిచేశాడు. చిరకాల ప్రత్యర్థి అయిన చైనాను ఎలా దెబ్బకొట్టాలో తమ దేశ సైనికులకు సూచించాడు. చైనా దూకుడుకు కళ్లెం వేసి.. ప్రస్తుతంచ అధ్యక్ష పదవిలో లేకున్నా.. చైనాకు చుక్కలు చూపుతున్నాడు.
కొద్దికాలంగా చైనా చాలా దూకుడా వ్యవహరిస్తోంది. సరిహద్దు దేశాలపై తన ప్రతాపాన్ని చూపించాలని కయ్యానికి కాలు దువ్వుతోంది. అయితే అందుకు తగ్గట్టుగా ప్రత్యర్థి దేశాలు ప్రతిఘటిస్తుండగా.. తీరుమార్చుకోని చైనా మళ్లీమళ్లీ తప్పును చేస్తూనే వస్తోంది. పొరుగుదేశమైన తైవాన్ ను చైనా ఆక్రమించుకోవాలని చూస్తోంది. చైనా విమానాలను తైవాన్ గగన తలానికి పంపించి.. కవ్వించింది. ఎప్పటికైనా చైనా తమ భూభాగాన్ని ఆక్రమించేస్తుందని తైవాన్ విదేశాంగ మంత్రి భయాన్ని వ్యక్తం చేశారు. ఈక్రమంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న ఓ సంచనల నిర్ణయం తైవాన్ కు కొత్త ఊపిరిపోసేలా కనిపిస్తోంది.
గతవారం ఓ 50 విమానాలు తైవాన్ గగన తలంలో ప్రవేశించాయి. వీటిలో భారీగా విస్పోటన పదార్థాలు ఉన్నాయి. దీనిపై భయాందోళన వ్యక్తం చేసిన తైవాన్ సర్కారు ఇక లొంగిపోక తప్పదనే ప్రకటన చేసింది. అయితే తైవాన్ సర్కారుకు అమెరికా సైన్యం అండగా నిలుస్తోంది. ఎంతటి యుద్ధానికైనా సిద్ధంగా ఉన్నామని.. తైవాన్ ను చైనా చేతుల్లో పెట్టే అవకాశమే లేదని చెప్పుకొస్తున్నాయి. ఈ పరిస్థితి వస్తుందని అమెరికా సైన్యానికి అప్పటి అధ్యక్షుడు ట్రంప్ ముందుగానే సూచించాడు. ఈ క్రమంలో ఓ స్పెషల్ ఆపరేషన్ టీంను తైవాన్ లో దింపాడు. వీరు తైవాన్ సైనికులకు యుద్ధ విద్యల్లో కఠిన శిక్షణ ఇస్తున్నారు. అయితే ఈ అంశాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. తైవాన్ కు వెంటనే సైన్యం సాయాన్ని నిలిపివేయాలని కోరుతోంది. ట్రంప్ కాలంలో అమెరికాతో మంచి సంబంధాలు ఉన్న తైవాన్ ను చైనా నుంచి కాపాడాలని నిర్ణయించుకున్న మాజీ అధ్యక్షుడు ముందస్తు ఆలోచనతో సైన్యాన్ని దింపారనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైతే అమెరికా సైన్యం తైవాన్ లో లేదని అక్కడి ప్రభుత్వం చెబుతుండగా.. తైవాన్ సైనికులకు తమను ఎదుర్కొనే శక్తి లేదని చైనా వాదిస్తోంది.