Manipur Landslide: ఎముకలను కొరికే చలి.. విరిగి పడే కొండచరియలు.. మాడు పగలగొట్టే ఎండ.. ఇలాంటి ప్రతికూలతల మధ్య భారత దేశ ఆర్మీ పనిచేస్తోంది.. బహుశా ప్రపంచంలోనే ఏ ఆర్మీకి ఎన్ని రకాల కష్టాలు ఉండవు. పక్కలో బల్లెంలా పాకిస్తాన్, తరచూ చికాకు పెట్టే చైనా, బంగ్లాదేశ్ రోహింగ్యాలు, కాశ్మీర్ లో ఉగ్రవాదులు.. ఇలా ఎటు చూసుకున్నా భారత్ కు శత్రు దేశాల నుంచి ముప్పు ఎక్కువ. ఇందువల్లే దేశ సంరక్షణ కోసం ఏటా బడ్జెట్లో రక్షణ శాఖకు అధికంగా నిధులు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది బడ్జెట్లో 76.6 బిలియన్ డాలర్లు దేశ రక్షణ కోసం కేటాయించారు. వీటిల్లో 63 శాతం ఆయుధాల కొనుగోలుకు వెచ్చించారు. ఇక ఆయుధ సంపత్తిలో ప్రపంచంలో భారతదేశం మూడో స్థానంలో ఉంది. భారతదేశాని కంటే ముందు అమెరికా, చైనా ఉన్నాయి.
ఆర్మీ అంటేనే అనేక సవాళ్ళు
ఆర్మీ అంటేనే అనేక సవాళ్ళతో కూడుకున్న ఉద్యోగం. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో కొండచరియలు విరిగిపడటంతో ఎనిమిది మంది సైనికులు దుర్మరణం చెందారు. 45 మంది సైనికులు గల్లంతయ్యారు. వారికోసం ఆర్మీ గాలిస్తోంది. గురువారం జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. మరోసారి జవాన్ల భద్రతపై అనేక సందేహాలను మన ముందుంచింది.
Also Read: Maharashtra CM : మహారాష్ట్రలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్.. సీఎంగా ఫడ్నవీస్ కాదు.. ఎవరంటే?
మన చుట్టూ ఉండే దేశాలతో ముప్పు ఎక్కువ కాబట్టి త్రివిధ దళాలు నిత్యం గస్తి కాస్తుంటాయి. అయినప్పటికీ పుల్వామా, గాళ్వాన్, పఠాన్ కోట్ వంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వందలాది మంది సైనికులు వీరమరణం పొందుతూనే ఉన్నారు. ఎన్ని రకాల అధునాతన ఆయుధాలు తీసుకొచ్చినా ఉగ్రవాదులు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. వారికి వివిధ దేశాల నుంచి ఐఎస్ఐ, ఐసిస్ వంటి సంస్థల ద్వారా నిధులు వస్తుండడంతో దేశ భద్రతకు భంగం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారు. వాటిని ఎప్పటికప్పుడు మన భద్రతా బలగాలు తిప్పి కొడుతున్నప్పటికీ జరిగే సైనిక నష్టం ఎక్కువగా ఉంటున్నది.
నరకం చూపిస్తున్న వాతావరణం
జమ్మూకాశ్మీర్లోని సియాచిన్ లో మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది.. నిండు ఎండా కాలమైనా అదే పరిస్థితి ఉంటుంది. హిమాలయ పర్వతాలకు దగ్గరగా ఉండటమే ఇందుకు కారణం. సియాచిన్ పాకిస్తాన్ కు సరిహద్దుగా ఉంటుంది. దేశ భద్రతకు సంబంధించి అత్యంత సున్నితమైన ప్రాంతం ఇది. ఇక్కడ సైనికులు నిత్యం గాస్తి కాస్తూ ఉంటారు.
వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఒక సైనికుడు మూడు గంటలకు మించి గస్తి కాయలేడు. అంతకు మించితే అతని రక్తం గడ్డకట్టు కుపోతుంది. ఇక మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చైనాకు సరిహద్దుగా ఉంటాయి. ఇక్కడ గస్తీ కాయడం సైనికులకు నిత్యం సవాలే. విరిగిపడే కొండ చరియలు, ఆకస్మాత్తుగా ముంచెత్తే వరదలు సైనికులను పొట్టన పెట్టుకున్నాయి. రెండు ఏళ్ల క్రితం గాల్వాన్ లోయలో జరిగిన ఘటనలో కూడా ప్రతికూల వాతావరణం మన సైనికులను చాలా ఇబ్బంది పెట్టింది. ఇక పాకిస్తాన్ కు సరిహద్దుగా ఉన్న రాజస్థాన్ లోని జై సల్మీర్ ప్రాంతం లో కాపలా కాయడం సైనికులకు ఎప్పుడూ ఒక సవాలే. ఇక్కడ సరాసరి 55 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది.ఒక సైనికుడు సుమారు 8 నుంచి 12 గంటల వరకు పహారా కాయాల్సి ఉంటుంది. ఒకవేళ అంతకుమించితే శరీరం నిస్సత్తువ గురై ప్రాణాలు పోయే అవకాశాలుంటాయి. ఇలాంటి ప్రకృతి ప్రతికూలతల వల్ల ఏటా దేశం సుమారు 100 మంది సైనికులను కోల్పోతోంది.
Also Read:KTR- Modi: మోడీదీ మోసమైతే తమరిదేంటిది కేటీఆర్ సార్?