Homeఆంధ్రప్రదేశ్‌Lakshmi Parvati - Sajjala : నాడు టిడిపిలో లక్ష్మీపార్వతి.. నేడు వైసీపీలో సజ్జలనా?

Lakshmi Parvati – Sajjala : నాడు టిడిపిలో లక్ష్మీపార్వతి.. నేడు వైసీపీలో సజ్జలనా?

Lakshmi Parvati – Sajjala : తెలుగుదేశం పార్టీ నుంచి దివంగత ఎన్టీఆర్ ను వెళ్ళగొట్టడానికి లక్ష్మీపార్వతి కారణమన్న విషయం తెలుగుదేశం పార్టీ శ్రేణులు నమ్ముతుంటాయి. లక్ష్మి పార్వతి చేతుల్లో నుంచి పార్టీని రక్షించుకోవాలని ఉద్దేశంతోనే నాడు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని ఆ పార్టీ కేడర్ ఇప్పటికీ చెబుతోంది. అయితే, లక్ష్మీపార్వతి లాంటి వ్యక్తి ఇప్పుడు వైసీపీలో తయారయ్యారు అన్న విమర్శలు వస్తున్నాయి. దీనిపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటో చూసేద్దాం.

తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారాలు చేసే వెండి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రజాభిమానాన్ని చూరగొంటున్న తరుణంలో లక్ష్మీపార్వతి వలన పార్టీకి దూరం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరకంగా చెప్పాలంటే పార్టీ ఆయనను బహిష్కరించింది. పార్టీని కాపాడుకునేందుకు అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, నందమూరి కుటుంబ సభ్యులు చంద్రబాబును ముఖ్యమంత్రి చేశారు. ఆ తరువాత అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే, వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి అప్పటి లక్ష్మి పార్వతిలాగా ఎందుకు ఒక వ్యక్తి తయారయ్యారని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఆ సంక్షోభం తలెత్తకుండా చూసుకోండి..

‘నాడు తెలుగుదేశం పార్టీలో లక్ష్మీపార్వతిలాగా నేడు వైకాపాలో సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహరిస్తున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో తలెత్తిన సంక్షోభం లాంటిది మన పార్టీలో తలెత్తకుండా చూసుకోండి’ అంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించారు. ఢిల్లీలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంచివారైనప్పటికీ, లక్ష్మీ పార్వతి ప్రమేయం ఎక్కువ కావడంతో 1995లో తెలుగుదేశం పార్టీలో సంక్షోభం తలెత్తిందన్నారు. ‘ సజ్జల రామకృష్ణారెడ్డి మన పార్టీలో మరో లక్ష్మీపార్వతుల వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన జగన్మోహన్రెడ్డిని హెచ్చరించారు. ఇది చేయి దాటకముందే ఆయన పక్కన పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు.

పెరుగుతున్న అసంతృప్తులకు కారణం..

అధికార వైసీపీలో అసంతృప్తులకు కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అని రఘురామకృష్ణంరాజు స్వాష్టం చేశారు. పరిస్థితి చేయి దాటక ముందే ఆయనను పక్కన పెట్టకపోతే ఎక్కువ మందిలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే మెజారిటీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారని, ఎమ్మెల్యేలను ఒకప్పటి సాక్షి దినపత్రిక ఉద్యోగి సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్ట్ చేయాలనడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. సజ్జల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పటికైనా అప్రమత్తం కావడం ద్వారా పార్టీని రక్షించుకునేందుకు అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. పోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందికర పరిస్తితులు ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉండాలని సూచించారు.

ఏ ప్రాతిపదికన ఓటు వేయలేదని చెబుతున్నారు..

మొన్న జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతున్నారో చెప్పాలని రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రశ్నించిన ఆనం నారాయణరెడ్డి ప్రశ్న సహేతుకుమని స్పష్టం చేశారు. వైకాపా కోసం మేకపాటి కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, పార్టీ స్థాపించినప్పటి నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ పార్టీకి వెన్నెముకగా ఉన్నారన్నారు. జగన్ పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనకు మద్దతుగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారని, తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో జై మంగళ వెంకటరమణ కు ఓటు వేశానని, అందుకే ఆయన గెలిచారని చెబుతున్నారన్నారు. అంతర్గత నివేదికల ఆధారంగా వారిని సస్పెండ్ చేశామని చెప్పడం సిగ్గుచేటని రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి మేల్కోవాలి..

సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేలుకోవాలని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ప్రజల్లోనూ, పార్టీ క్యాడర్ లోను అసంతృప్తి పెరుగుతోందని, దానిని గుర్తించి చల్లార్చే ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్నందున మేలుకోకపోతే ఘోర పరాభవాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. పార్టీలో ఒకరిద్దరు నాయకులు చెప్పిన మాటలను కాకుండా.. చెప్పే సూచనలు సలహాలు పరిగణలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా ఎంపీ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular