ఆంధ్రప్రదేశ్‌లో విగ్రహాల ధ్వంసం ఏమాత్రం ఆగడం లేదు. రామతీర్థం, విజయవాడ ఘటనలు మరువక ముందే తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. సింగరాయకొండ మండలం పాతసింగరాయకొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా పేరొందిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ ముఖద్వారంపై ఉన్న లక్ష్మీనృసింహస్వామి, రాజ్యలక్ష్మి, గరుత్మంతుడి విగ్రహాల చేతులు విరిగిపోయి కనిపించాయి. మంగళవారం ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ సంపత్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని ముఖద్వారం, విగ్రహాలను పరిశీలించారు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే ధ్వంసం చేశారా?.. లేక వాతంటవే విరిగిపోయాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అధికార వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.
Also Read: రూట్ మార్చిన టీడీపీ..: టార్గెట్ తిరుపతి
ఇదిలా ఉండగా.. నెల్లూరు జిల్లా విజయనగరం జిల్లాలో కోదండ రామస్వామి విగ్రహం ధ్వంసం ఘటనకు నిరసనగా బీజేపీ, జనసేన తలపెట్టిన రామతీర్థ ధర్మయాత్ర ఉద్రిక్తంగా మారింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్న నాయకులు పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రామతీర్థం కూడలి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకున్నారు. సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు నిర్వహించొద్దని ఆదేశించారు. ఈ సందర్భంగా వీర్రాజుతో పాటు పలువురిని అదుపులోకి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది.
Also Read: వారందరికీ సీబీఐ నోటీసులు..: ఎందుకంటే..?
ఏమైంది.. అసలు ఏమైంది.. ఏపీలో రోజుకొకటి చొప్పున హిందూ ఆలయాలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ వైపు రాష్ట్రమంతటా ఇదే విషయమై రచ్చరచ్చ నడుస్తుంటే.. దుండగులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నారు. నిద్రలేచి చూసే సరికి ఎక్కడో ఒక చోట ఇలాంటి వార్త వినాల్సి వస్తోంది. మరోవైపు.. విగ్రహాల ధ్వంసంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నా.. ఇప్పటివరకు ఒక్క నిందితుడిని కూడా పట్టుకోలేకపోయారు. చివరికి ఈ విగ్రహాల ధ్వంసం.. ఆలయాలపై దాడులు ఎటు దారితీస్తాయో తెలియకుండా ఉంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్