Kurnool District Politics: కర్నూలు జిల్లాలో నేతలకు కొదువ లేదు. పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలే పార్టీలో కొనసాగుతున్నాయి. కానీ తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం దిశగా తీసుకెళ్లలేకపోతున్నారు. కనీసం క్షేత్రస్థాయిలో ఉనికి చాటుకోలేకపోతున్నారు. కోట్ల ఫ్యామిలీ, కేఈ ఫ్యామిలీ, భూమా ఫ్యామిలీ, గౌరు ఫ్యామిలీతో పాటు బీసీ, మైనార్టీ నేతలు ఆ జిల్లాలో ఉన్నారు. దశాబ్దల రాజకీయ నేపథ్యం, రాష్ట్ర స్థాయిలో పదవులు అలంకరించిన నేపథ్యం ఉన్నా.. జిల్లాలో తెలుగుదేశం పార్టీని నడిపించే వారే కరువయ్యారు. పార్టీపరంగా ఎటువంటి క్రియాశీలక కార్యక్రమాలు లేవు. ఒక విధంగా చెప్పాలంటే ఏపీని 25 జిల్లాలుగా కాకుండా.. ముందు రూపంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ అత్యంత బలహీనంగా ఉన్న జిల్లాగా పేర్కొనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. పార్టీని ఆదరించే వారున్నా.. క్షేత్రస్తాయిలో నడిపించే వారు లేకపోతున్నారు.

దివంగత భూమా నాగిరెడ్డి కుటుంబానిది జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక స్థానం. భూమా, శోభా నాగిరెడ్డి దంపతుల మరణానంతరం వారసురాలిగా అరంగేట్రం చేసిన అఖిలప్రియ టీడీపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆ ఫ్యామిలీకి రాజకీయ కార్యకలాపాలు కంటే ఇతర వ్యవహారాలే ఎక్కువయ్యాయి. ఇటీవల కేసులు కారణంగా పొలిటికల్ గా డ్యామేజ్ జరిగింది.
Also Read: RRR: ‘ఆర్ఆర్ఆర్’ పై నారా లోకేష్ సహా హీరోలు, ప్రముఖులు ఏమన్నారంటే?
కుటుంబసభ్యులు కూడా చేరోదారి చూసుకున్నారన్న అపప్రదను మూటగట్టుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన కేఈ కుటుంబం ఒక్కసారిగా సైలెంట్ అయ్యింది. ఏ మాత్రం యాక్టివ్ గా వ్యవహరించడం లేదు. ఇప్పటికే కేఈ సోదరుడు ఒకరు పార్టీకి రాజీనామా ప్రకటించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కుటుంబం పార్టీలో ఉన్నా పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు.

కోట్ల విజయభాస్కర్రెడ్డి వారసులుగా రాజకియాల్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. కానీ ఎందుకో టీడీపీలో ఆశించిన స్థాయిలో పనిచేయలేకపోతున్నారు. ఇక గౌరు చరిత కుటుంబం కూడా ప్రభావం చూపలేకపోతోంది. టీడీపీలో చేరి చేజేతులా కష్టాలను కోరి తెచ్చుకున్నారని వారి అనుచరులు బాధ పడుతుంటారు. మరో పార్టీలోకి వెళ్లడానికి ముఖం చాలక పార్టీలోనే అంటీముట్టనట్టుగా గడుపుతున్నారు. మైనార్టీ విభాగానికి చెందిన నేతలు ఉన్నా ఆ వర్గంలో కూడా ప్రభావం చూపలేకపోతున్నారు.
Also Read: Chandrababu Naidu: బాబుకు కొత్త తలనొప్పి..: అభ్యర్థుల మార్పు అసలుకే మోసం..?
[…] RRR Fans Dies In Accident: మామూలు సినిమాలకే అభిమానులు ఎగబడి చూస్తారు. అలాంటిది ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న రాజమౌళి సినిమా, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న త్రిపుల్ ఆర్‌ను చూసేందుకు ఇంకెంత ఆసక్తి చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు దఫాలుగా వాయిదా పడటంతో.. చాలా మంది ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. […]
[…] AP Liquor Policy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మద్య నిషేధానికి తూట్లు పొడుస్తున్నారు. మద్యంతోనే రాష్ట్రం బతుకుతోందని భరోసా కల్పిస్తున్నారు. ఇందుకోసమే మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. దీనిపై విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజల ఆగ్రహానికి బలవుతున్నారు. మద్యం వ్యాపారం మీదే ఆధారపడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సాగుతున్నాయనేది ఆయన మాటల్లో అంతరార్థం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మద్యనిషేధం చేస్తామని చెప్పినా తరువాత అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచిపోయారు. […]
[…] Amit shah vs Prashant Kishor: ఎన్నికల్లో గెలుపు కోసం వ్యూహాలు అమలు చేయడంలో ఎవరికి వారే దిట్ట. కేంద్ర హోం మంత్రి అమిత్ షాది ఒక స్టైల్ అయితే ప్రశాంత్ కిషోర్ ది మరో పద్దతి. అయితే పలు సందర్భాల్లో వీరి శక్తియుక్తుల గురించి కామెంట్లు వచ్చినా అధికారంలో ఉండి వ్యూహాలు ఖరారు చేయడం కాదు అధికారంలో లేనప్పుడు చేయడమే గొప్ప అని ప్రశాంత్ కిషోర్ చెబుతుంటారు. కానీ ఇప్పుడు వారిద్దరు కలిసి పనిచేసే సన్నివేశం ఆవిష్కృతం కానుంది. దీంతో ఎవరు గొప్పో ఎవరు కాదో నిరూపితం కానుంది. గుజరాత్ ఎన్నికలకు కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు పీకే ఓకే చెప్పారని తెలుస్తోంది […]